NRI-NRT

ఘనంగా తామా క్రిస్మస్ వేడుకలు

TAMA 2019 Atlanta Christmas Celebrations

మెట్రో అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ క్రిస్మస్ వేడుకలు కమ్మింగ్ నగరంలోని లైఫ్ లైన్ తెలుగు చర్చిలో గత శనివారం నాడు ఘనంగా నిర్వహించారు. స్థానిక తెలుగువారు ఈ క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్నారు. సిలికానాంధ్ర టీచర్లు బాలబాలికలు ఈ క్రిస్మస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రీతి పవార్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఆటల పోటీలు నిర్వహించారు. చర్చి నిర్వాహకులు ఫేస్ పెయింటింగ్ ఏర్పాటు చేశారు. లైఫ్ లైన్ చర్చి పాస్టర్ సంజీవ్ కటికల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ వేడుకల్లో తామా అధ్యక్షుడు వెంకీ గద్దె, ఇన్నయ్య ఎనుముల, రవి కల్లి, సాయిరాం కారుమంచి, రాజశేఖర్ చుండూరి, శ్రీనివాస్ ఉప్పు, శ్రీరామ్ రొయ్యల, సిలికానాంధ్ర మనబడి కార్యనిర్వహణాధికారి విజయ్ రావిళ్ల, పాల్ పుణ్యసముద్రం, నిరుపమ నీల తదితరులు పాల్గొన్నారు.