Fashion

కలంకారీ బ్లేజర్

Telugu Fashion News-Kalankari Blazer

కళ… కలకాలం మన్నాలన్నా… మన్ననలు అందుకోవాలన్నా… ఆధునికతను అది తొడుక్కోవాల్సిందే! తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ కళల్లో ఒకటైన కలంకారీ… కళాపిపాసి విశాలి కోలా వల్ల ఆధునికతను అద్దుకుంటోంది. ప్రపంచ ఫ్యాషన్‌ వేదికపై మెరుస్తోంది. కలంకారీ అనగానే… చిత్తూరుజిల్లా శ్రీకాళహస్తి గుర్తొస్తుంది. అదే ప్రాంతానికి చెందిన విశాలి కోలా… ఈ కళకు కొత్త సొబగులు చేకూరుస్తున్నారు. ఇండో-వెస్ట్రన్‌ ఫ్యూజన్‌లో కలంకారీ కళను… ఆధునిక వస్త్రాలకు అద్దుతున్నారు. బ్లేజర్‌, టాప్‌, ఫుల్‌ఫ్రాక్స్‌, స్ట్రెయిట్‌ ఫుల్‌ కుర్తా, కుర్తీ, జీన్స్‌ జాకెట్లపై కలంకారీని అలంకరిస్తున్నారు. ఈ నెల రెండోవారంలో చెన్నైలో ఈ వస్త్రాలకు ప్రత్యేకంగా ఒక ఫ్యాషన్‌ షో నిర్వహించి అందరినీ ఆకట్టుకున్నారు. చిన్నప్పటి నుంచి ఫ్యాషన్‌ రంగంలో రాణించాలనుకున్న తన కలను బతికించుకోవడంతో పాటు… ప్రాచీన కలంకారీ వస్త్ర డిజైన్లకు అంతర్జాతీయ స్థాయిలో పేరు తీసుకురావడానికి కృషిచేస్తున్నారు. ‘‘కలంకారీ వస్త్ర డిజైన్లను దిల్లీ, మిలాన్‌ ఫ్యాషన్‌ షోలలో ప్రదర్శించాలనేది నా లక్ష్యం. నా భర్త కోలా ఆనంద్‌ ప్రోత్సాహంతో ఈ అద్భుత కళను ఈ తరానికి చేరువచేస్తా’’నని విశాలి ధీమాగా చెబుతున్నారు.

Image result for kalankari blazer