ScienceAndTech

వెండిలో చాలా రకాలు ఉన్నాయి

Types of silver-Telugu business news

వెండిని చూసుంటారు…దాంతో తయారైన ఆభరణాలు వేసుకుని ఉంటారు… మరి దాని వల్ల ఇంకేమైనా లాభాలున్నాయా? అసలది ఎన్ని రకాలుగా ఉంటుంది? ఈ విషయాలేమైనా తెలుసా? తెలియకపోతే చదివేయండి గబగబా!వెండి… దీన్ని ఆంగ్లంలో సిల్వర్‌ అంటారు. ఇదొక రసాయన మూలకం. లాటిన్‌ భాషలో వెండిని ఆర్జెంటమ్‌ అంటారు. అందుకే దీన్ని Ag అనే సంకేతంతో సూచిస్తారు. దీని పరమాణు సంఖ్య : 47
* రాగి, సీసం, బంగారం, జింక్‌ వంటి వాటిని శుద్ధి చేసినప్పుడు ఉప ఉత్పత్తిగా వెండి లభిస్తుంది.
* క్రీస్తుపూర్వం నాలుగు వేల సంవత్సరాల నాటి వెండి వస్తువులు గ్రీసులో దొరికాయి.
***ఎన్ని రకాలో!
వెండి అనగానే మనకు ఒకటే గుర్తుకు వస్తుంది. కానీ దీంట్లో ముఖ్యంగా 8 రకాలున్నాయి.
* .999 ఫైన్‌ సిల్వర్‌. ఇది స్వచ్ఛమైన వెండికి అతి దగ్గరగా ఉంటుంది.
* స్టెర్లింగ్‌ సిల్వర్‌. దీన్ని .925 సిల్వర్‌ అంటారు.
* ఆర్జెంటమ్‌ సిల్వర్‌. చిలుము పట్టని వెండి మిశ్రమలోహం ఇది. 92.5 శాతం వెండి ఉండి మిగిలిన శాతం ఇతర లోహాలు మిశ్రమమై ఉంటాయి.
* కాయిన్‌ సిల్వర్‌
* సిల్వర్‌
* సిల్వర్‌ ఫిల్డు
* సిల్వర్‌ ప్లేటెడ్‌
* నికెల్‌ సిల్వర్‌!
***భలే గొప్పలు!
* అన్ని లోహాల కన్నా వెండి అత్యుత్తమ విద్యుత్‌ వాహకం, ఉష్ణవాహకం.
* వెండి అయాన్లు, సమ్మేళనాలు, బ్యాక్టీరియా, ఆల్గే, ఫంగైలను నాశనం చేస్తాయి. అందుకే నీటిని శుద్ధి చేయడంలో, ఫిల్టర్‌ చేయడంలో వెండి ఎంతగానో సాయపడుతుంది.
* పారిశ్రామికంగా వెండిని పదివేల రకాలుగా వినియోగించుకుంటున్నారు.
* ఇటీవల వెలుగులోకి వచ్చిన నానో కణాల ఆవిష్కరణతో గృహోపకరణాల్లో నానోసిల్వర్‌ చాలా రకాలుగా తన సేవలు అందిస్తోంది. సిల్వర్‌ నానో తీగలు… అనేక రకాల రోగాలను నిర్ణయించడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి.
* మెర్క్యురీ విష ప్రభావానికి ఇది విరుగుడుగా పనిచేస్తుంది.
* తలుపులకు ఉండే చేతి పిడులు ఇప్పుడు వెండి కోటింగ్‌తో వస్తున్నాయి. ఈ వెండి కోటింగ్‌ వల్ల బ్యాక్టీరియా ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందలేదు.
* డీవీడీల్లోని సమాచారం ఎక్కువకాలం, ప్రతిభావంతంగా నిల్వ ఉండటానికి వాటిపై అతి పలుచని వెండిపొరలు ఏర్పాటు చేస్తున్నారు.
* సూపర్‌ కండక్టర్స్‌ (అతివాహకాలు)కు వెండి జోడించడంతో విద్యుత్‌ ప్రసారాలు అత్యంత ప్రతిభావంతంగా జరుగుతున్నాయి.
* సోలార్‌ ప్యానల్స్‌లో ఒక్కొక్క దానిలో 20 గ్రాముల సిల్వర్‌ను ఉపయోగిస్తున్నారు.
* సిల్వర్‌ ఆక్సైడ్‌ బ్యాటరీల తయారీలో వెండిని వాడుతున్నారు. ఈ బ్యాటరీలు వినికిడి పరికరాలు, వాచీలు ఇంకా చిన్న చిన్న ఎలక్ట్రానిక్‌ వస్తువుల్లో వాడుతున్నారు.
* పాలిస్టర్‌ పొరలపై సిల్వర్‌ను కలిపి కిటికీలకు తగిలిస్తున్నారు. దీని వల్ల లోపలికి వచ్చే కాంతి తీవ్రత బాగా తగ్గుతుంది.
* కారు ఇంజన్‌ బేరింగ్‌లకు వెండిని ఉపయోగిస్తున్నారు. ఇది ఇంజన్‌ పుట్టించే వేడిని తట్టుకోగల్గడమేగాక ఘర్షణను బాగా తగ్గిస్తోంది.
* దంత వైద్య చికిత్సలో, ఎల్‌ఈడీ చిప్స్‌ తయారీలో, ఔషధాలు, న్యూక్లియార్‌ రియాక్టర్లు, సెమీకండక్టర్లు, టచ్‌ స్క్రీన్స్‌ వంటి పరికరాల్లో విశేషంగా ఉపయోగిస్తున్నారు.
1. నాజూకు వెండి:
(.999 ఫైన్‌ సిల్వర్‌): ఇది 99.9 శాతం స్వచ్ఛం. మిగిలిన 0.1 శాతం పెద్దగా నాణ్యతలేని ఇతర మూలకాల జాడలు ఉంటాయి
* ఈ నాజూకు వెండి స్టెర్లింగ్‌ సిల్వర్‌కి ఉండే మెరుపు పాలిష్‌ కన్నా ఎంతో ప్రకాశవంతంగా ఉంటుంది.
* ఈ వెండి బాగా మెత్తగా ఉండటం వల్ల చక్కగా సాగుతుంది. సులువుగా సొట్టలు పడుతుంది. అందుకే వెండి ఆభరణాల్లో చాలా వాటి తయారీకి పనికి రాదు. ఎందుకంటే ఈ వెండితో తయారైన ఆభరణాల జీవితకాలం తక్కువ. సులువుగా గీతలు, సొట్టలు పడి ఆకృతిని కోల్పోతాయి. కానీ చెవి రింగులు, నెక్లస్‌ వంటి ఆభరణాలు చేయడానికి పనికి వస్తుంది.
2. స్టెర్లింగ్‌ సిల్వర్‌:
అమెరికా, యూరప్‌ ఇంకా ప్రపంచంలోని అనేక దేశాలు దీన్ని వాణిజ్యపరంగా ప్రామాణికమైన వెండిగా పరిగణిస్తారు.
* ఇది 92.5 శాతం వెండి… మిగిలిన 7.5 శాతం రాగి కలిపిన మిశ్రమలోహం.
* దీనిలో ఇతర లోహాల్ని కలపడం వల్ల ఈ వెండికి మంచి గట్టితనం వస్తుంది. ఎక్కువకాలం మన్నుతుంది. అంతేకాదు… కొనుగోలు దారులను ఆకర్షించే కాంతులతో ప్రకాశవంతంగా ఉంటుంది.
* ఈ వెండి ఎంత కాంతిమంతంగా ఉన్నా చిలుము పడుతుంది. పాలిష్‌ పదార్థాలతో కొంతకాలం చిలుము పట్టకుండా ఆకర్షణీయంగా ఉండేటట్లు కాపాడుకోవచ్ఛు ఎక్కువ రకం ఆభరణాలు ఈ స్టెర్లింగ్‌ వెండితోనే చేస్తారు.