Food

ఎండుద్రాక్షతో ఆరోగ్య ప్రయోజనాలు ఇవి

Kiss Miss Raisins Health Benefits-Telugu diet news

ఎండుద్రాక్ష ఆరోగ్యానికి శ్రీరామ రక్ష అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అందుబాటు ధర, సులువుగా జీర్ణం కావటం, ఆకట్టుకొనే రుచి వంటి ఎన్నో ప్రత్యేకతలున్న ఎండు ద్రాక్ష ఆరోగ్య పరిరక్షణలో ఎంతగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.ఎండు ద్రాక్షలోని పొటాషియం అధిక రక్తపోటును అదుపు చేయటమే గాక కుచించుకుపోయిన రక్తనాళాలను తెరుచుకొనేలా చేసి రక్తప్రసరణను పెంచుతుంది. రోజూ 20 ఎండుద్రాక్షలను నీటిలో నానబెట్టి తింటే రక్తశుద్ధి జరగటమే గాక నరాలు బలం పుంజుకొంటాయి.ఎండు ద్రాక్షలోని విటమిన్ ఏ, బీటాకెరోటిన్, కెరటినాయిడ్స్ కంటి పనితీరును పెంచి, నేత్ర సంబంధ వ్యాధులను దరిజేరనీయవు. ఇందులో’ఒలెనిక్ ఆమ్లం’ దంతాల్లోని హానికారక బ్యాక్టీరియా ను తొలగిస్తుంది. వీటి లోని ‘అర్జినిన్’ అనే అమినో ఆమ్లం లైంగిక సామర్ధ్యాన్ని పెంచుతుంది. అందుకే దంపతులు రోజూ వీటిని తినాలి.ఇందులో పుష్కలంగా ఉండే పీచు పదార్ధం మలబద్ధకాన్నినివారిస్తుంది. మలబద్ధక బాధితులు రాత్రి నిద్రకు ముందు 10 ఎండుద్రాక్ష, అరచెంచా సోంపు కలిపి తింటే సుఖవిరేచనం అవుతుంది. వేడి నీటిలో ఎండుద్రాక్ష ముక్కలు వేసి నానిన తర్వాత ఆ నీటిని చిన్నారులకు పట్టిస్తే వారి జీర్ణశక్తి పెరుగుతుంది. ఎండుద్రాక్షలోని ఫినోలిక్ ఫైటో న్యూట్రియంట్లు క్రిములను చంపే జర్మిసైడ్స్ గా పనిచేసి పలు అనారోగ్యాల నివారణ, నియంత్రణకు దోహదం చేస్తాయి.