Editorials

చూడవల్సింది ఇవి

The only things that matters are these

1. చూడవలసింది శరీర అందం కాదు– మాటల అందం, ఆలోచనల అందం, పనులు అందం అలవాట్ల అందం, గుణాల అందం
2. చూడవలసినది బాహ్య సౌందర్యం కాదు- అంతర్ సౌందర్యం
3.చూడవలసింది భోగ విషయాలు కాదు – దైవ విషయలు
4.చూడవలసింది బుక్ తే కాదు కాదు – ముక్తి కూడా,
5.చూడవలసింది మన ఇల్లు బాగుండటం కాదు-మన మనసు బాగుండటం
6.చూడవలసింది ధన వృద్ధి కాదు – జ్ఞాన వృద్ధి.
7. చూడవలసింది వస్తు సముపార్జన కాదు – జ్ఞాన సముపార్జన.
8. చూడవలసింది సంపదలు కాదు – జ్ఞాన సంపద.
9. చూడవలసింది రూపం కాదు – గుణం.
10. చూడవలసింది దేహాభిమానం కాదు – ఆత్మాభిమానం.
11, చూడవలసింది దేహచింతన కాదు – దేహి చింతన.
12. చూడవలసింది దేహాన్ని కాదు – ఆత్మను.
13. చూడవలసింది శారీరక ఆనందాన్ని కాదు – ఆత్మానందాన్ని
14. చూడవలసింది భౌతికం కాదు – ఆధ్యాత్మికం.
15. చూడవలసింది బాహ్య ప్రియం కాదు – భావ ప్రియం.
16. చూడవలసింది సుఖకరమైనవి కాదు – శ్రేయస్కరమైనవి.
17. చూడవలసింది వయస్సులో వృద్ధులను కాదు – జ్ఞానం లో వృద్దులు.
18. చూడవలసింది సంసార సుఖం కాదు – శాశ్వత సుఖం.
19. చూడవలసింది చచ్చిపుట్టే జీవితం కాదు – చావు పుట్టుకల లేని జీవితం.
20. చూడవలసింది శారీరక శుద్ధి కాదు – మాట శుద్ధి, భావ శుద్ధి,
21. చూడవలసింది ఏమి చేస్తున్నారో కాదు – ఎలా చేస్తున్నాము.
22. చూడవలసింది ఏమి మాట్లాడుతున్నామొ కాదు – ఎలా మాట్లాడు తున్నామో
23. చూడవలసింది ఇతరుల మెప్పు కాదు – భగవంతుని మొప్ప
24, చూడవలసింది ఇతరులలో దోషులు కాదు – తనలో దోషాలు.
25, చూడవలసింది మానసిక శాంతి కాదు – ఆత్మ శాంతి.
26. చూడవలసింది మానసిక తృప్తి కాదు – బ్రహ్మానందాన్ని,
27. చూడవలసింది తాను తరించడం కాదు – అందరూ తరించాలని,
28. చూడవలసింది తన సంసార బాగుండాలని కాదు – అందరూ బాగుండాలని.
29. చూడవలసింది శత్రు నాశనం కాదు – అంతర్ శత్రు నాశనం.
30, చూడవలసింది శిష గణాన్ని కాదు – చెప్పె బోధలు..
31. చూడవలసింది పేరు ప్రఖ్యాతులు కాదు – వచ్చిన పని సాధించడం.
32. చూడవలసింది భగవంతుడి శక్తి కాదు – భగవంతుడు చెప్పిన బోధలు ఆచరిస్తున్నారు అని.
32 చూడవలసింది ఎంత బాగా మాట్లాడుతున్నాడో అని కాదు – చెప్పేది ఎంత బాగా ఆచరిస్తున్నారు ఆని
33. చూడవలసింది చదువు కాదు – సంస్కారన్ని
34. చూడవలసింది కామి గా కాదు – మోక్షగామి గా,
35. చూడవలసింది అధికారంలో ఉన్న స్థితిని కాదు – జ్ఞానం లో ఉన్నత స్థితి ని.
36, చూడవలసింది పాండిత్యం కాదు – ఆత్మ జ్ఞానం.
37. చూడవలసింది సౌఖ్యాన్ని కాదు – ధ్యాన సాధన ని.
38. చూడవలసింది ఎంత పెద్ద మేడని నిర్మించాడు అని కాదు – ఎంత పెద్ద జ్ఞాన సౌధం నిర్మించారు
39. చూడవలసింది సంపదలు పెంచుకున్నాడు అని కాదు – జ్ఞాన సంపద పెంచుకున్నాడు అని.
40. చూడవలసింది లేని దాన్ని కాదు – సత్యాన్ని
41. చూడవలసింది శరీరాన్ని కాదు – నీ నిజ రూపాన్ని
42 చూడవలసింది తాత్కాలికం కాదు – శాశ్వతం.
43 చూడవలసింది నశించిపోయేదాన్ని కాదు – నశింపు లేని దాన్ని,
44, చూడవలసింది కళ్ళు కనబడే దాన్ని కాదు – కనబడని దాన్ని.
45 చూడవలసింది తాత్కాలిక సుఖాన్ని కాదు – శాశ్వత శాంతిని,
46. చూడవలసింది ప్రాపంచిక విషయాలు కాదు – ఆధ్యాత్మిక విషయాలు.
47, చూడవలసింది అతని వద్ద ఏమి వుంది అని కాదు – అతను ఏ స్థితిలో ఉన్నాడు అని.
48. చూడవలసింది అజ్ఞానమనే చీకటిని కాదు – జ్ఞానమనే వెలుగు.