Business

విస్తారా…జీతాలు ఇస్తారా?

Vistara Airlines Puts Senior Officials Under Leave

మే, జూన్‌ల్లో నెలకు 4 రోజుల వరకు వేతనం లేని తప్పనిసరి సెలవులు తీసుకోవాలని సీనియర్‌ ఉద్యోగులను ఆదేశించినట్లు విస్తారా సీఈఓ లెస్లీ తంగ్‌ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో లాక్‌డౌన్‌ వల్ల విమానయాన ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నగదు నిల్వలను కాపాడుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్‌లో సీనియర్‌ ఉద్యోగులను ఆరు రోజుల వరకు వేతనం లేని సెలవులు తీసుకోవాల్సిందిగా విస్తారా ఆదేశించిన విషయం తెలిసిందే. సీనియర్‌ స్థాయిలో ఉన్న 1,200 మంది ఉద్యోగులపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది. కేబిన్‌ సిబ్బంది, గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌ సేవల్లో పనిచేసే 2,800 మందిపై దీని ప్రభావం ఉండదని ఉద్యోగులకు పంపిన ఇ-మెయిల్‌లో విస్తారా స్పష్టం చేసింది. పైలెట్లకు ఇచ్చే నెలవారీ ఫ్లైయింగ్‌ అలవెన్స్‌ను 20 గంటలకు తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఇంతకు ముందు ఇది 70 గంటలుగా ఉండేది. ఉద్యోగాలను కాపాడుకునేందుకు సిబ్బంది ఖర్చులు తగ్గించుకోక తప్పడం లేదని సంస్థ వెల్లడించింది.