DailyDose

గ్యాంగ్‌వార్‌లో ఓ మహిళది కీలక పాత్ర-నేరవార్తలు

గ్యాంగ్‌వార్‌లో ఓ మహిళది కీలక పాత్ర-నేరవార్తలు

* గ్యాంగ్ వార్ కేసులో కొనసాగుతున్న దర్యాప్తుడీసీపీ హర్ష వర్ధన్ ఆధ్వర్యంలో విచారణసందీప్ గ్యాంగ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు13మంది నిందితులను విచారిస్తున్న పోలీసులుల్యాండ్ సెటిల్మెంట్ వివాదమే కారణమని గుర్తింపు..ఈ గొడవలో మంగళగిరికి చెందిన ఇద్దరు రౌడీ షీటర్ల హస్తం..టెక్నాలజీ సాయంతో కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు..నిందితుడు పండు తల్లి పాత్రపై కూడా విచారిస్తున్న పోలీసులు.రేపు సందీప్ గ్యాంగ్ ను మీడియా ముందు ప్రవేశ పెట్టె ఛాన్స్..

* ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని జమ్ములపాలెం కాకుటూరువారిపాలెం మధ్యలోని జామాయిల్ తోటలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం. పురుగుల మందు కూల్ డ్రింక్ లో కలుపుకుని తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆనవాళ్ళు.

* బంజారాహిల్స్‌లో రూ.50 కోట్ల విలువైన భూ వివాదానికి సంబంధించిన అవినీతి వ్యవహారం కలకలం రేపుతోంది. రూ.15లక్షల నగదుతో పట్టుబడిన షేక్‌పేట్‌ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ నాగార్జున రెడ్డిని అవినీతి నిరోధకశాఖ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అర్ధరాత్రి వరకు షేక్‌పేట్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో అవినీతి నిరోధకశాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. అర్ధరాత్రి 12గంటలకు తహసీల్దార్‌ సుజాతను అధికారులు ఇంటికి పంపించారు. నాంపల్లి అనిశా కార్యాలయంలో ఇవాళ మరోసారి తహసీల్దార్‌ను విచారించనున్నారు. అవినీతి వ్యవహారంలో ఆర్‌ఐ నాగార్జున రెడ్డి, ఎస్‌.ఐ రవీంద్రనాయక్‌పై ఇప్పటికే కేసునమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. మరో వైపు తహసీల్దార్‌ సుజాత ఇంట్లో రూ.30లక్షల నగదుతో పాటు బంగారు నగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇంకా ఎంతమంది పాత్ర ఉందన్నదానిపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. భూ వివాదానికి సంబంధించిన దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు.

* సంచలనం సృష్టించిన విజయవాడ గ్యాంగ్‌ వార్‌ కేసు దర్యాప్తును పోలీసులు మరింత ముమ్మరం చేశారు. సందీప్‌ గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఘర్షణలో మంగళగిరికి చెందిన ఇద్దరు రౌడీషీటర్ల హస్తం ఉన్నట్లు గుర్తించారు. వీరితో పాటు కీలక నిందితుడు పండు తల్లిని కూడా విచారిస్తున్నారు. గుంటూరు సర్వజన ఆసుపత్రిలో పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య పండు చికిత్స పొందుతున్నాడు. వైద్యులు, సిబ్బందిని తప్ప ఎవరినీ లోనికి అనుమతించడంలేదు. గాయాల నుంచి కోలుకుంటే పండును రేపు డిశ్ఛార్జి చేసే అవకాశముంది.