Movies

ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా ఒదిగిపోగల గుమ్మడి

ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా ఒదిగిపోగల గుమ్మడి

ఏ పాత్ర నైననూ అవలీలగా పోషించి, అనితర సాధ్యంగా నటించి, జీవించి, మెప్పించగల సహజ నటుడు, కళాప్రపూర్ణ గుమ్మడి. ఈరోజు ( జులై 9th ) ఆ మహా నటుడు జయంతి సందర్భంగా.. నివాళులతో…. ??

తెలుగు సినిమా రంగములో గుమ్మడిగా ప్రసిద్ధి చెందిన గుమ్మడి వెంకటేశ్వరరావు తెలుగు చలనచిత్రరంగంలో ఐదు దశాబ్దాలకు పైగా నటించాడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బహూకరించే రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత. ఇతను 500కు పైగా సినిమాలలో విభిన్న తరహా పాత్రలు పోషించాడు.
పుట్టిన తేదీ: 9 జులై, 1928
పుట్టిన స్థలం: రావికంపాడు
మరణించిన తేదీ: 26 జనవరి, 2010
మరణించిన స్థలం: కేర్ హాస్పిటల్స్ – హాయ్-టెక్ సిటీ, హైదరాబాద్