DailyDose

8మంది పోలీసులను హతమార్చిన రౌడీషీటర్ అరెస్ట్-నేరవార్తలు

8మంది పోలీసులను హతమార్చిన రౌడీషీటర్ అరెస్ట్-నేరవార్తలు

* దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాన్పుర్‌ ఎన్‌కౌంటర్‌లో ప్రధాన సూత్రధారి అరెస్టయ్యాడు.మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో రౌడీ షీటర్​ వికాస్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.  ఈ నెల 3న అర్ధరాత్రి కాన్పుర్‌లో అతడిని పట్టుకునేందుకు వచ్చిన పోలీసు బృందంపై వికాస్​ గ్యాంగ్​ కాల్పులు జరిపింది.ఈ ఎన్‌కౌంటర్‌లో 8 మంది పోలీసులు అమరులయ్యారు. అప్పటినుంచి పరారీలో ఉన్నాడు వికాస్​.అతని కోసం యూపీ పోలీసు బృందాలు విస్తృతంగా గాలించాయి. ఎట్టకేలకు ఇవాళ ఉదయం చిక్కాడు. వికాస్​.. మధ్యప్రదేశ్​ ఉజ్జయినిలోని మహాకాల్​ ఆలయానికి వెళ్తుండగా.. భద్రతా సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.అప్రమత్తమైన స్థానిక పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు.అరెస్టు అనంతరం.. తానే వికాస్​ దూబేనని, కాన్పుర్​ వాసినని అంగీకరించాడు. వికాస్​ అరెస్టును మధ్యప్రదేశ్ హోం​ మంత్రి నరోత్తమ్​ మిశ్రా ధ్రువీకరించారు. యూపీ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. దూబే అరెస్టైన విషయాన్ని మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​కు ఫోన్​లో తెలిపారు.ఉత్తర్​ప్రదేశ్​ పోలీసులకు నిందితుడిని అప్పగించనున్నట్లు స్పష్టం చేశారు.  మోస్ట్​ వాంటెడ్​ గ్యాంగ్​స్టర్​ అయిన దూబేపై 60కి పైగా క్రిమినల్​ కేసులు ఉన్నాయి. ఇతని తలపై రూ. 5 లక్షల రివార్డు ఉంది.ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకుని హత్యలు, బెదిరింపులు సహా అనేక అక్రమాలకు పాల్పడ్డాడు.వికాస్‌ అరెస్టుతో నేరాల కట్టడిలో యూపీ పోలీసులు భారీ విజయం సాధించారు. అంతకుముందు వికాస్ దూబే అనుచరుల్లో మరో ఇద్దరు ఇవాళ ఉదయం ఎన్​కౌంటర్​లో చనిపోయారు.వేర్వేరు ఎన్​కౌంటర్లలో వికాస్​ అనుచరులైన ప్రభాత్ మిశ్రా, బహువా దూబే చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.కస్టడీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించి కార్తీకేయ అలియాస్ ప్రభాత్ మిశ్రా పోలీసుల కాల్పుల్లో చనిపోయాడు.ప్రభాత్​తో పాటు మరో ఇద్దరిని పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.కాన్పుర్​ ఎన్​కౌంటర్​ తర్వాత హతమైన వికాస్​ బృంద సభ్యుల సంఖ్య ఐదుకు చేరింది. 

* భారీ మొత్తంలో ఖైనీ ప్యాకెట్లు పట్టివేత రూ.18 లక్షల విలువైన కైనీ ప్యాకెట్లు మరియు రూ 997500/-లు నగదు స్వాధీనం చేసుకున్న టాస్క్‌ఫోర్స్. విజయవాడ నగర పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఖైనీ అమ్మక దార్లపై ఉక్కుపాదంమోపి ఖైనీ అమ్మకాలను నియంత్రించడానికి విజయవాడ టాస్క్ఫోర్స్ వారి ఆధ్వర్యంలో విస్తృత దాడులు నిర్వహించడం జరుగుతుంది ఈ క్రమంలో భాగంగా ఖైనీ తరలిస్తున్నట్లు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ శ్రీ బి.శ్రీనివాసులు ఐ.పి.ఎస్., గారికి రాబడిన సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ ఏ.డి.సి.పి. డా|| శ్రీ కె.వి.శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఏ.సి.పి.లు శ్రీ టి.కనకరాజు, శ్రీ వి.ఎస్.ఎన్. వర్మ, ఇన్ స్పెక్టర్ శ్రీ పి.కృష్ణమోహన్, ఎస్.ఐలు శ్రీ కె. సేషారెడ్డి, శ్రీ జి.శ్రీనివాసరావు మరియు వారి సిబ్బందితో ది. 09072020 వ తేదీన విజయవాడ, వై.ఎస్.ఆర్. కాలనీ, వై.వి.రావు ఎస్టేట్స్ రింగ్ సెంటర్ వద్ద ఎపి31టిడి 6237 నెంబరు గల లారీని తనిఖీలు.

* భీమవరం డ్రగ్స్ రాకెట్ కేసులో మరో నలుగురు అరెస్ట్. ఈ కేసులో గత నెల 23వ తేదీన ఆరుగురిని అరెస్ట్ చేసిన భీమవరం ఒకటో పట్టణ పోలీసులు.

* కృష్ణాజిల్లా…..మైలవరం…..శ్రీకాకుళం నుండి హైదరాబాద్ కి ఐరిష్ లారీ లో తరలిస్తున్న 50 ఆవులను స్థానిక ఇంజినీరింగ్ కళాశాల వద్ద పట్టుకున్న పోలీసులు.

* ఉంగుటూరు మండలం తేలప్రోలులో దారుణం. అభంశుభం తెలియని ఐదేళ్ల మైనర్ బాలికపై ఆత్యచారం చేసిన 60 ఏళ్ల ప్రబుద్దుడు.

* అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం కొడికొండ చెక్ పోస్టు వద్ద భారీగా పట్టుబడ్డ గుట్కా పాకెట్లు చిక్బలాపూర్ నుంచి కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గం గిద్దలూరు చెందిన బొలెరో ఏపీ 39 టి సి64 95 తరలిస్తుండగా గా హిందూపూర్ రూరల్ సీఐ ధరణి కిషోర్ ఎస్సై వెంకటేశ్వర్లు తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డ గుట్కా పాకెట్లు, వీటి విలువ సుమారు 28 వేల రూపాయలు బొలెరో వాహనం గుట్కా ప్యాకెట్లు సీజ్ చేసినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.