DailyDose

చంద్రబాబు దగ్గర ఆధారాలు ఉంటే మాకు ఇవ్వాలి-నేరవార్తలు

చంద్రబాబు దగ్గర ఆధారాలు ఉంటే మాకు ఇవ్వాలి-నేరవార్తలు

* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి డిజిపి లేఖ. ప్రధానమంత్రికి తమరు రాసిన లేఖలో పేర్కొన్న ఫోన్ టాపింగ్ వంటి పలు అంశాలకు సంబంధించి మీ వద్ద ఉన్న సాక్ష్యాధారాలను మాకు అందజేయగలరని కోరుతున్నాను. రాష్ట్రంలోని పౌరులకు రక్షణ కల్పించడం, రాజ్యాంగ హక్కులను కాపాడేందుకు మేము ఎల్లవేళలా అన్ని విధాలుగా దృఢసంకల్పంతో ఉన్నామని తమరికి తెలియజేస్తున్నాను. మాకు పూర్తిస్థాయిలో సహకరించి పౌరుల హక్కులను కాపాడేందుకు, చట్టాన్ని అమలుపరిచేందుకు సహకరించగలరని కోరుతున్నాను.

* బెజవాడ నోవాటల్ హోటల్ వద్ద కారుపై పెట్రోల్ పోసి హత్యాయత్నానికి పాల్పడిన కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. డబ్బులు వ్యవహారమే హత్యాయత్నానికి ప్రధాన కారణంగా పోలీసులు గుర్తించారు. ఏడాది క్రితం నాగమణి, గంగాధర్ దంపతులు, కృష్ణారెడ్డిలకు వేణుగోపాల్‌ రెడ్డి అనే వ్యక్తి రూ.2 కోట్లు అప్పుగా ఇచ్చాడు. అయితే అప్పుగా తీసుకున్న సొమ్మును ఇవ్వకుండా నాగమణి,గంగాధర్ దంపతులు,కృష్ణారెడ్డి కాలం వెళ్లుబుచ్చుతున్నారు. ఫైనాన్స్ వ్యవహారం సెటిల్ మెంట్ చేసుకుందామని వారిని వేణుగోపాల్ రెడ్డి చర్చలకు పిలిచాడు. ఈ క్రమంలో వేణుగోపాల్ రెడ్డికి…నాగమణి,గంగాధర్ దంపతులకు ,కృష్ణారెడ్డికి మధ్య వివాదం నెలకొంది. దీంతో పథకం ప్రకారం వేణుగోపాల్‌రెడ్డి ముందుగానే తన వెంట తీసుకువచ్చిన పెట్రోల్‌ను కృష్ణారెడ్డి, నాగవల్లి..గంగాధర్ దంపతులపై పోసి… అలాగే కారుపై పోసి నిప్పటించాడు. అనంతరం వేణుగోపాల్ రెడ్డి అక్కడ నుంచి పరారయ్యాడు. ఒంటిపై మంటలతో కారు నుండి బయటకు వచ్చి కృష్ణారెడ్డి ప్రాణాలు కాపాడుకోగా… కారు వెనుక సీట్లో కూర్చోవడంతో నాగవల్లి, గంగాధర్ దంపతులు స్వల్పగాయలతో బయటపడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు పటమట పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.

* ఫోన్ ట్యాపింగ్ అంశంపై హైకోర్టు విచారణ 20కి వాయిదాఫోన్ ట్యాపింగ్ అంశంపై హైకోర్టులో విచారణ వాయిదావిచారణ ఈ నెల 20కి వాయిదా వేసిన హైకోర్టుఆధారాలు ఉంటే జతచేసి అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశంఅఫిడవిట్‌ దాఖలు చేయాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాదికి ఆదేశందర్యాప్తు ఎందుకు జరపకూడదని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని ప్రశ్నించిన హైకోర్టుకౌంటర్‌ దాఖలు చేయాలని సర్వీస్‌ ప్రొవైడర్లకు హైకోర్టు నోటీసులుఎల్లుండిలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశం

* తెలంగాణ కూడా రాజస్తాన్‌ ఎడారిలా  మారుతుందని హైకోర్టు హెచ్చరించింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఖాజాగూడ చెరువు దురాక్రమణకు గురవుతోందంటూ సోషలిస్ట్‌ పార్టీ (ఇండియా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ లుబ్నా సావత్‌ రాసిన లేఖను హైకోర్టు సుమోటో ప్రజాహిత వ్యాజ్యంగా స్వీకరించింది. దీనిపై సోమవారం విచారణ జరిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఖాజాగూడ చెరువు దురాక్రమణకు గురవుతుందని కలెక్టర్ కు ఆదేశించినా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. అయితే బదిలీ అయ్యారని ఈ వ్యవహారంపై పూర్తి వివరాలను సమర్పించేందుకు కొంత గడువు కావాలని అధికారులు కోరారు. హైదరాబాద్ , రంగారెడ్డి పరిధిలోని చెరువుల్ని ఆక్రమణకు గురవుతున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించింది. ఇలానే చూస్తూ పోతే తెలంగాణ కూడా రాజస్థాన్ ఎడారిలాగా తయారవుతుందని హెచ్చరించింది. చెరువుల పరిరక్షణకు ఎలాంటి కమిటీలు వేస్తారు? ఎలాంటి చర్యలు తీసుకుంటారో కోర్టుకు తెలపాలంది. సెప్టెంబర్ 8 కి కేసును వాయిదా వేసింది.  

* పది ప్రభుత్వరంగ బ్యాంకుల కన్సార్షియంను రూ.1,530 కోట్ల మేర మోసం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న లూథియానాకు చెందిన ఎస్‌ఈఎల్‌ టెక్స్‌టైల్స్‌ లిమిటెడ్‌ (సెల్ట్‌), దాని డైరెక్టర్లపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసింది. కంపెనీ డైరెక్టర్లుగా ఉన్న రామ్‌ శరణ్‌ సలూజా, నీరజ్‌ సలూజా, ధీరజ్‌ సలూజాలను కూడా సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. సెల్ట్‌ దాని డైరెక్టర్లు బ్యాంకులను మోసం చేయడానికి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని, ఈ నిధులను దారి మళ్లించడంతో బ్యాంకులకు నష్టం వాటిల్లినట్టు సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సీబీఐ రంగంలోకి దిగింది.