Food

ఆకుల్లో భోజనానికి యూరోపియన్ల ఆసక్తి

ఆకుల్లో భోజనానికి యూరోపియన్ల ఆసక్తి

ఒకవేళ అవి దొరకకపోతే విస్తరాకుల్లో అయినా ఆహారం భుజించేవారు. ఇప్పుడు ఆ అలవాటు పోయింది. ఎప్పుడో అరకొరగా వాటిని వాడుతున్నారు. శుభకార్యాల్లో కూడా ప్లాస్టిక్ ప్లేట్స్ ని.. లేదంటే ప్లాస్టిక్ కోటెడ్ విస్తరాకుల్ని వాడుతున్నారు. అయితే యూరప్ లో వాటికి ఎంత డిమాండ్ అంటే అక్కడి ఫైవ్ స్టార్ హోటల్స్ తో పాటు చిన్న చిన్న హోటల్స్ లో సైతం విస్తరాకుల్నే వాడుతున్నారట.మనం వదిలేసిన సంప్రదాయాన్ని వారు పాటిస్తున్నారన్న మాట. వీటిని మన దేశం నుంచి భారీగా డిమాండ్ చేసుకుంటున్నారు కూడా. ముఖ్యంగా ఒడిశా రాష్ట్రంలోని దియోగర్, అంగుల్, సంబల్పూర్, కందమాల్ ప్రాంతాల్లోని 130 గిరిజన గ్రామాలకు చెందిన 3,800 మంది మహిళలకు ఇప్పుడు మాంచి ఉపాధి దొరికింది. మనదేశంలో వాటికి గిరాకీ పెద్దగా లేక మొన్నటి వరకు చాలా దిగులు పడిన వీరంతా తాజగా యూరప్ లో వీటికి పెరిగిన డిమాండ్ తో భారీగా ఆదాయం సంపాదిస్తున్నారట. మన శరీరానికి హాని చేసే ప్లాస్టిక్ కన్నా.. ఆరోగ్యానికి మేలు చేసే, భూమిలో కలిసిపోయే ఆకుల్లో ఆహారం భుజిస్తే మంచిదని యూరోపియన్ దేశాల వారు బాగా విశ్వసిస్తున్నారట. అందుకే అనారోగ్యాల బారిన పడకుండా ఇలా విస్తరాకుల్లో ఆహారాన్ని తినడం అలవర్చుకుంటున్నారట. ఎన్నో అనారోగ్యాలకు కారణమైన ప్లాస్టిక్ ప్లేట్లలో ఆహారాన్ని తినడం మానేసి మనం కూడా మర్చిపోయిన విస్తరాకుల్లో ఆహారం తిందాం.