NRI-NRT

మంచు గుప్పిట ఫ్రిస్కో హనుమాన్ ఆలయం. టెక్సాస్ మంచు తుఫాన్.

Texas Winter Storm 2021 Gallery - Frisco Hanuman Temple Under Snow

భారతదేశ వాతావరణానికి దగ్గరగా ఉండే టెక్సాస్ రాష్ట్రం ఈ సోమవారం నుండి మంచు గుప్పిట్లో గజగజ వణుకుతోంది. సోమ, మంగళ, బుధవారాల్లో కురుసిన మంచుకు ప్రసిద్ధి చెందిన ఫ్రిస్కో హనుమాన్ ఆలయాన్ని మంచు కప్పేసింది. పలు గృహాలకు కరెంటు, నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడినప్పటికీ టెక్సాస్ విద్యుత్ సంస్థలు రొటేషన్ పద్ధతిలో విద్యుత్‌ను పంపిణీ చేస్తున్నారు. ఒక్కొక్క కమ్యూనిటీకి 2గంటలు విద్యుత్ ఇచ్చి గంట సేపు కోత విధిస్తున్నారు. అర్వింగ్, డల్లాస్ ప్రాంతాల్లో చాలామందికి పూర్తిగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వార్మింగ్ సెంటరులో ఆశ్రయం పొందుతున్నారు. చలికి పైపుల్లోని నీరు గడ్డకట్టడంతో పలు అపార్ట్‌మెంట్లలో అమెరికన్లు, భారతీయులు ఇబ్బందులకు గురవుతున్నారు. బుధవారంతో మంచు ఆగిపోయినప్పటికీ గురు, శుక్రవారాల్లో విద్యుత్, నీటి సరఫరాలు పునరుద్ధరిస్తారని సరుకుల కోసం తీవ్ర రద్దీ ఏర్పడుతుందని ప్రవాసులు భావిస్తున్నారు.