Politics

చింతమనేని ప్రభాకర్ అరెస్ట్

చింతమనేని ప్రభాకర్ అరెస్ట్

పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన తెదేపా నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను ఏలూరు పోలీసులు అరెస్టు చేశారు. పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరు మండలం మాదేపల్లికి వచ్చిన ఆయనను ఏలూరు గ్రామీణ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. పెదవేగి మండలం బి.సింగవరం గ్రామంలో బుధవారం రాత్రి చింతమనేని ప్రభాకర్‌ ప్రచారం నిర్వహించారు. అనంతరం వైకాపా-తెదేపా నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు వైకాపా నేతల ఫిర్యాదు మేరకు ఘటనాస్థలంలో చింతమనేని లేనప్పటికీ ఆయనపైనా కేసు నమోదు చేసి తాజాగా అరెస్ట్‌ చేశారు.