Devotional

పెనుగంచిప్రోలు ఆలయంలో కరోనా కలకలం-TNI బులెటిన్

పెనుగంచిప్రోలు ఆలయంలో కరోనా కలకలం-TNI బులెటిన్

* తెలంగాణలో ఈ నెల 20 తర్వాత లాక్‌డౌన్‌ ఎత్తివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.కరోనా కేసులు తగ్గుతుండటంతోపాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుదలకు వీలుగా రోజంతా సాధారణ కార్యకలాపాలను అనుమతించే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.వ్యవసాయ సీజన్‌ వేగం పుంజుకోవడంతో ఆంక్షల ఎత్తివేతను అనివార్యంగా ప్రభుత్వం భావిస్తోంది.

* కరోనా సెకండ్‌ వేవ్‌ సినిమా ఇండస్ట్రీని ఇంకా పీడిస్తూనే ఉంది.దక్షిణాది సినిమా ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి కవిత ఇంట్లో విషాదం నెలకొంది.ఆమె కుమారుడు సంజయ్‌ రూప్‌ కరోనాతో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు.మరోవైపు ఆమె భర్త సైతం కరోనాకు గురయ్యారు. ఆరోగ్యం విషమించడం వల్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేసిన కవిత..తనకంటూ ప్రత్యేక గురింపు తెచ్చుకున్నారు.ఆమె కుమారుడి మృతిపై ఆయా చిత్రపరిశ్రమల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

* కొవిడ్‌ విధులు నిర్వహిస్తున్న రెగ్యులర్‌ వైద్య సిబ్బందిలాగే తమకూ రూ.50 లక్షలకు బీమా కల్పించాలని ఏపీ స్టేట్‌ గవర్నమెంట్‌ కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ స్టాఫ్‌ నర్సెస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.

* పెనుగంచిప్రోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో అర్చకుడుకు కరోనా పాజిటివ్.గత నాలుగు రోజులుగా జ్వరం వస్తున్నట్లు సమాచారం.3 రోజులు క్రితం జ్వరంతో ఆలయంలో విధులకు హాజరు.జ్వరం రావడంతో విధులు నుంచి వెనుకు పంపిణా ఆలయ అధికారులు.రెండు రోజులు క్రితం ప్రవేట్ ల్యాబ్ లో కరోనా టెస్ట్ చేయించగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు సమాచారం.భయం ఆందోళన లో అర్చకులు, భక్తులు.హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్న అర్చకుడు.ఆలయం లో అర్చకులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అవడంతో ఆలయం పరిసరాలు ఆలయంలో శానిటేషన్ పిచికారి చేయించిన అధికారులు.

* ఏపీకి తొమ్మిది లక్షల కొవిషీల్డ్​, 76,140 కొవాగ్జిన్‌ టీకా డోసులు అందాయి.

* దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య కాస్త పెరిగింది.కొత్తగా 67 వేల 208 మంది వైరస్ బారిన పడ్డారు. మహమ్మారి ధాటికి మరో 2,330 మంది ప్రాణాలు కోల్పోయారు.మొత్తం కేసులు: 2,97,00,313.మొత్తం మరణాలు: 3,81,903.కోలుకున్నవారు: 2,84,91,670.యాక్టివ్ కేసులు: 8,26,740.బుధవారం 19,31,249 నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది.దీనితో ఇప్పటివరకు చేసిన మొత్తం పరీక్షల సంఖ్య 38,52,38,220కు చేరింది.

* దేశంలో గతేడాది నుంచి విలయం సృష్టిస్తున్న కరోనా కారణంగా 30 వేలకు పైగా చిన్నారులు తల్లిదండ్రులకు దూరమైనట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.