NRI-NRT

సిలికానాంధ్ర విశ్వవిద్యాలయానికి 67ఎకరాలు విరాళం. కాలిఫోర్నియాలో ₹3300కోట్లతో నిర్మాణం.

సిలికానాంధ్ర విశ్వవిద్యాలయానికి 67ఎకరాలు విరాళం. కాలిఫోర్నియాలో ₹3300కోట్లతో నిర్మాణం.

అమెరికాలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం – ప్రపంచస్థాయి ప్రాంగణ నిర్మాణం

ప్రవాస భారతీయుల చరిత్రలో తొలిసారిగా భారతీయులచే 2016లో స్థాపించబడిన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం (University of Silicon Andhra) శాన్ వాకిన్ జిల్లా పరిధిలోని ట్రేసీ పట్టణ సమీపంలో ప్రపంచస్థాయి విద్యాప్రాంగణ నిర్మాణానికి తలపెట్టింది.

ఈ ప్రాంగణ నిర్మాణానికి ఎంతో విలువైన 67 ఎకరాల భూమిని ఇవ్వటానికి సంధు కుటుంబం దాతగా ముందుకొచ్చింది. ప్రపంచ ప్రసిద్ధిపొందిన సిలికాన్ వ్యాలీకి సమీపంలో ప్రధాన రహదారి పక్కన ఈ విశ్వవిద్యాలయ ప్రాంగణం రూపుదిద్దుకోనుంది. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ద్వారా శాన్ వాకిన్ జిల్లా యువత అనేక రకాలుగా లబ్ధి పొందుతారని సంధు కుటుంబసభ్యులు మైక్ సంధు, మణి సంధు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

విశ్వవిద్యాలయ అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ మాట్లాడుతూ అందరి మన్నలను, సహకారాన్ని పొందిన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం స్థానికంగా, దేశవ్యాప్తంగా విభిన్న రంగాల అభివృద్ధికై సముచితమైన విద్యాబోధనను అందిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. స్థానికంగా ఉండే అట్టడుగు వర్గాల అభివృద్ధికి తోడ్పడుతూ స్పష్టమైన ప్రణాళికతో ఉన్నతస్థాయిలో పరిశోధనాత్మకమైన విద్యను అందించే దిశగా విశ్వవిద్యాలయం పథకాలను అవలంబిస్తుందని అన్నారు.

రాబోయే 5 సంవత్సరాల కాలంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ఈ ప్రాంగణ నిర్మాణం సింహభాగాన్ని పూర్తిచేయాలన్న తలంపుతో ఉన్నది. ఈ విశ్వవిద్యాలయ ప్రాంగణ నిర్మాణానికి సుమారుగా 450 మిలియన్ డాలర్ల (రూ.3300 కోట్లు) ఖర్చు అవుతుందని అంచనా. దాతల సహకారంతో ఈ విశ్వవిద్యాలయ ప్రాంగణం రూపుదిద్దుకోనుంది.

ప్రొవోస్ట్ చమర్తి రాజు మాట్లాడుతూ శాన్ వాకిన్ జిల్లా సామాజిక, ఆర్థిక అభివృద్ధికై సహయపడే విద్యాప్రణాళికను రూపొందిస్తామని అన్నారు. ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మసీ, భాషాశాస్త్రాలు, యోగ, ఆయుర్వేద, సంగీత నృత్య కళలలో BS/MS/MA మరియు Ph.D. డిగ్రీలను అందించే అత్యున్నత స్థాయి విశ్వవిద్యాలయంగా రూపొందబోతోందని తెలిపారు.

ఉన్నతవిద్యను అందించే సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం శాన్ వాకిన్ జిల్లా ప్రాంతానికి రావటం పట్ల ప్రభుత్వ అధికారులు, స్థానిక పాలకులు హర్షం వ్యక్తం చేశారు.

సిలికానాంధ్ర విశ్వవిద్యాలయానికి సంబంధించిన వివరాలు https://www.uofsa.edu వెబ్ సైటులో లభ్యమవుతాయి.

#################

UNIVERSITY OF SILICON ANDHRA ANNOUNCES PLANS TO BUILD WORLD CLASS CAMPUS IN SAN JOAQUIN COUNTY

UofSA to Be Key Element of the Sandhu Family’s Proposed Golden State Logistics Hub project

Milpitas, Calif. – The University of Silicon Andhra (UofSA) is excited to announce its plans to build a world class campus in San Joaquin County and its inclusion in the proposed Golden State Logistics Hub. Dhan Sukh, LLC has submitted a preliminary application to San Joaquin County to begin development of The Golden State Logistics Hub – a proposed 1,500-acre development with a university, logistics hub, and VFW Post.

The project includes 67-acres of land for the private, nonprofit, four-year and graduate university to expand its degree offerings and its reach within the community. Mike Sandhu, the project’s proponent, was instrumental in working with community leaders and UofSA to recruit the accredited bay area university to San Joaquin County. The Sandhu family generously agreed to gift the 67 acres to the UofSA.

“The University of Silicon Andhra will bring new energy and educational innovation to the region,” exclaimed Manii Sandhu, a mechanical engineer speaking on behalf of the Sandhu family. “We see this project creating tangible opportunities for locals to study, learn and earn for their families.”

UofSA President, Anand Kuchibhotla expressed his enthusiasm for the new project and all the support it has garnered in the community. “UofSA is an inclusive and diverse learning community that provides an opportunity to the students to actualize their potential as scholar-practitioners and to contribute to their local and global community with excellence, professionalism, and integrity,” Kuchibhotla explained. “Being able to expand our high-quality academic and research programs on the 67-acre site will allow us to uplift underrepresented students and the community.”

A private nonprofit, WASC Senior College and University Commission (WSCUC) accredited University serving as the only university in the Nation that is primarily serving Indian-Americans, the University of Silicon Andhra will now have the ability to expand to 5,000 students and 300 faculty and staff, provide Vocational Training, as well as Language Arts, Engineering, Business, Pharmacy, Medical and other degrees.

UofSA Provost, Raju Chamarthi is excited about the societal, academic, and economic opportunities this new partnership will provide. He noted, “We plan to bring an expanded educational experience that is both rigorous and relevant to the people of this community.”

Community and elected leaders are excited about the proposed project. In support of the project, Asm. Carlos Villapudua said, “Having the University of Silicon Andhra make its permanent home here in San Joaquin County is a major win for everyone. It will provide a high-quality education to a broad base of students from underrepresented populations.”

San Joaquin County Supervisor Robert Rickman declared his excitement about the potential new University saying, “We live in a country where everyone should have an opportunity to receive a great education. Higher education and vocational training are a necessity to prepare our children for the future. Education, training, and investing in our future workforce will attract heads of households and long-term sustainable jobs to San Joaquin County,”

Chairman of the San Joaquin County Board of Supervisors, Tom Patti was optimistic about the potential University campus saying, “We are passionate about providing multiple pathways to success in San Joaquin County. Whether that be via a University-degree program or trade school, we want to see local residents equipped to provide for their families and compete in the 21st century.”

More here – https://www.ttownmedia.com/tracy_press/university-campus-planned-for-south-of-tracy/article_b5777e9c-14dd-11ec-836f-fbd920eadf4e.html