NRI-NRT

కెనడా వెళ్లే భారతీయులకు శుభవార్త

కెనడా వెళ్లే భారతీయులకు శుభవార్త

కెనడా వెళ్లే భారత ప్రయాణికులకు శుభవార్త. భారత్‌ నుంచి నేరుగా వచ్చే విమానాలకు ఆ దేశం అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు ‘ట్రాన్స్‌పోర్ట్‌ కెనడా’ ట్వీట్‌ చేసింది. సోమవారం నుంచి భారత విమానాలు తమ భూభాగంలో దిగొచ్చని పేర్కొంది. ప్రయాణికులు దిల్లీ విమానాశ్రయంలో తాము గుర్తించిన ల్యాబ్‌లో కొవిడ్‌ మాలిక్యులర్‌ టెస్టు చేసుకోవాలని తెలిపింది.