DailyDose

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ – TNI నేర వార్తలు 08/02/2022

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్  – TNI నేర వార్తలు 08/02/2022

* విల్లా కొనుగోలు అగ్రిమెంట్ ద్వారా 1.4 కోట్ల మోసానికి ఓ వ్యక్తి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్‌లో విల్లా కొంటానని.. సరోర్ ఇనాయతుల్లా అనే వ్యక్తి బ్యాంక్‌లో లోన్ తీసుకున్నాడు. అగ్రిమెంట్ ద్వారా లోన్ తీసుకున్న సరోర్.. అనంతరం బ్యాంక్‌కు తెలియకుండా.. అగ్రిమెంట్ ద్వారానే ఆ విల్లాను వేరే వారికి అమ్మేశాడు. మొత్తం మీద బ్యాంకు అధికారులకు రూ.1.4 కోట్లకు కుచ్చుటోపి పెట్టాడు. విషయం తెలుసుకున్న బ్యాంకు అధికారులు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబైలో తల సోమవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మంటలు చెలరేగి ఒక వ్యక్తి సజీవ దహనమయ్యాడు. ఈ సంఘటన పలమనేరు-కుప్పం జాతీయ రహదారిపై దొడ్ల డెయిరీ సమీపంలో చోటుచేసుకున్నది. రెండు వాహనాలు ఢీ కొట్టడంతో మంటలు చెలరేగి వాహనంలో ఉన్న వ్యక్తి ఆ మంటలకు ఆహుతయ్యాడు.దాచుకున్న నిందితుడిని అరెస్ట్ చేసి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు

* రూ. 12 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్
రూ. 12 వేలు లంచం తీసుకుంటూ కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖాన సీనియర్ అసిస్టెంట్ సురేందర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. తన కింది స్థాయి ఉద్యోగి మెడికల్ బిల్ చేసేందుకు సురేందర్ డబ్బు డిమాండ్ చేయడంతో బాధితుడు రమేష్ అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు.ఏసీబీ అధికారుల సూచన మేరకు దవాఖానలోలంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ భద్రయ్య ఆధ్వర్యంలో సురేందర్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

* అద్దె ఇంట్లో ఉంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఓ దళిత యువకుడు డబుల్‌ బెడ్‌రూం పథకం జాబితాలో నుంచి తన పేరును తీసివేయడంతో ఆందోళనతో సోమవారం ఆత్మహత్యాయత్నం చేశాడు. సిరిసిల్ల 29వ వార్డులోని ప్రగతినగర్‌లో పెరుక ప్రవీణ్‌ (25) ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. కిరాణా దుకాణంలో పనిచేస్తూ తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నాడు. డబుల్‌ బెడ్‌రూం కోసం ప్రవీణ్‌ దరఖాస్తు చేసుకున్నాడు. సర్వేలో అతనిని అర్హుడిగా గుర్తించారు.మొదటిరెండవ జాబితాల్లో అతని పేరు ఉంది.
*
* కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు ఢీ కొన్న ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. చిత్రదుర్గ జిల్లా హొసదుర్గ తాలూకాలో సోమవారం తెల్లవారుజామున జోడిరంగాపుర వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందినవారు మృత్యువాత చెందారు.
సూర్యాపేటజిల్లాలోని చిలుకూరు మండలం చెన్నారిగూడెం గ్రామంలో క్షుద్ర పూజల పేరుతో బురిడీ బాబా మోసానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంట్లో దోషం ఉందని కొందరి వద్ద, గుప్త నిధులు వెలికి తీస్తానని మరి కొందరి వద్ద బురిడీ బాబా శేషాచార్యులు లక్షలు వసూలు చేశాడు. క్షుద్రపూజలు చేయకుంటే ఇంట్లో ప్రాణనష్టం జరుగుతుందని జనాన్ని భయపెట్టాడు. ఈ క్రమంలో పలు ఇళ్లల్లో క్షుద్రపూజలు చేసిన దొంగ బాబా… దాదాపు పది లక్ష వరకు వసూలు చేశారు. కాగా… ఫలితం రాకపోవడంతో భాదితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాబా కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

* నిర్మల్ జిల్లా కేంద్రంలో నకిలీ నోట్ల చెలామని కలకలం రేగింది. స్థానిక మార్కెట్‌లో నకిలీ దుబాయి కరెన్సీని మార్చేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.వారు ఢిల్లీ వాసులుగా గుర్తించారు. వారివద్ద నుంచి నకిలీ నోట్లుమొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

* కామారెడ్డి మండలంచిన్నమల్లారెడ్డి గ్రామంలో హనుమండ్ల సాత్విక (\అనే బాలిక చున్నీతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పశువుల కొట్టంలో పనిచేయకపోవడంతో సాత్వికను తండ్రిఎల్లయ్య ఇంట్లో బంధించాడు. దీంతో మనస్థాపానికి గురైన బాలిక ఆత్మహత్య చేసుకుంది. అయితే సాత్వికమృతిపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకునికేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

* గుంటూరు జిల్లా తాడికొండగంజాయి మత్తులో తాడికొండ పోలీస్ స్టేషన్లో చొక్కా లేకుండా హల్చల్ చేసిన రౌడీ షీటర్ రియాజ్ ఎస్సై ను సైతం లెక్క చేయకుండా…దుర్భాషలాడిన వైనంరౌడీ షీటర్ రియాజ్ గతంలో..ఒక హత్య,పలు దొంగతనాల్లో నిందితుడుఅసభ్య పదజాలంతో తిడుతున్నా…స్పందించని ఎస్సై వెంకటాద్రిరౌడీ షీటర్ కావడంతో భయబ్రాంతులకు గురి అయిన పోలీస్ సిబ్బంది

* చిత్తూరు జిల్లా…..తిరుపతి…. బ్రేకింగ్. మొబైల్ షాప్ లో చోరీ. 30 మొబైల్స్, 50వేల నగదు అపహరణ. ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రూప్ థియేటర్స్ సమీపంలోనున్న మునిమొబైల్స్ లో ఘటన. మంగళవారం తెల్లవారుజామున ఆగంతకుడు చేసిన చోరీ దృశ్యాలు సి సి పుటేజ్ లో రికార్డ్. సంఘటన స్థలానికి ఈస్ట్ పోలీసులు క్లూస్ టీం చేరుకొని ఆధారాల సేకరణ.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఈస్ట్ పోలీసులు.

* అసోంలోని చిరాంగ్ జిల్లాలో దారుణం జ‌రిగింది. ఓ ఇద్ద‌రు పోలీసులు ట్రాఫిక్ రూల్స్‌ను పాటించ‌లేదు. హెల్మెట్ ధ‌రించ‌కుండా బైక్‌పై వెళ్తున్నారు. మీరు స‌మాజానికి ఇచ్చే సందేశం ఇదేనా? అని ఓ జ‌ర్న‌లిస్టు ఆ పోలీసులను ప్ర‌శ్నించాడు. దీంతో పోలీసులు స‌ద‌రు జ‌ర్న‌లిస్టుపై దాడి చేశారు. తీవ్రంగా కొట్టారు. మ‌రికొంత మంది పోలీసుల‌ను పిలిపించి.. జ‌ర్న‌లిస్టును బ‌ల‌వంతంగా జీపులో ఎక్కించారు. బాధిత జర్న‌లిస్టును జ‌యంత్ దేబ్‌నాథ్‌గా గుర్తించారు.

* కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రామారెడ్డి రోడ్డులో భిక్షాటన చేసే బాలికపై పెయింటర్ కనకయ్య అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. భయంతో బాలిక కేకలు వేయడంతో వెంటనే అక్కడకు చేరుకున్న స్థానికులు పెయింటర్‌ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఆపై నిందితుడిని పోలీసులకు అప్పగించారు. నిందితుడు కనకయ్య రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. అలాగే బాధితురాలు నిజామాబాద్‌కు చెందిన బాలికగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

* ఆర్మూర్‌లో భార్యను వదిలించుకోవడానికి భర్త దారుణానికి పాల్పడ్డాడు. గంగాసాగర్స్రవంతి దంపతులు ఆర్మూర్‌లో నివాసముంటున్నారు. ఏకంగా స్కిన్ అలర్జీ కోసం ట్రీట్‌మెంట్ అని చెప్పి స్రవంతికి గంగాసాగర్ స్టెరాయిడ్స్ ఇచ్చాడు. అనుమానం వచ్చి ఆసుపత్రిలో చూపించుకోగా స్రవంతికి అసలు విషయం తెలిసింది. స్రవంతిగంగసాగర్‌లకులో వివాహం జరిగింది. ప్రస్తుతం వీరికి  ఏళ్ల బాబు ఉన్నాడు. ఆర్మూర్‌లో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కాంపౌండర్‌గా పని చేస్తూనే.. గంగాసాగర్ ఆర్ఎంపీగా క్లినిక్ పెట్టుకున్నాడు. దీంతో  ఏళ్లకే స్రవంతి నరాల బలహీనతకు గురైంది. ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించు కోవడం లేదని స్రవంతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. న్యాయం చేయాలంటూ బాధితులు కలెక్టరేట్‌కు వచ్చారు.

* బంగారుపాలెం మండలం నందిని ఫుడ్ ప్లాజా వద్ద ఓ ప్రైవేట్ బస్సులో 17 లక్షల రూపాయలు చోరీకి గురైంది. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన ఓ వ్యాపారి వద్ద పనిచేసే ఆది బాబు అనే వ్యక్తి బెంగళూరుకు నగదు తీసుకుని పోతుండగా ఈ చోరీ జరిగింది. అల్పాహారం కోసం బస్సు నందిని ఫుడ్ ప్లాజా వద్ద నిన్నటి రోజు తెల్లవారుజామున ఆగిన సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆది బాబు నగదును కలిగిన బ్యాగ్‌ను లగేజ్ క్యారియర్‌లో పెట్టి అల్పాహారం కోసం వెళ్లి వచ్చేటప్పటికి మాయమైంది. బాధితుని ఫిర్యాదుతో స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు

*బాపులపాడు మండలంలోని వీరవల్లి పేపర్ మిల్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న ట్రాలిని బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్ మీద వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన విజయవాడ నుంచి జగ్గయ్యపేట వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు వాడపల్లి బాబు (40), వెంకటరమణ (42)గా పోలీసులు గుర్తించారు.

*మహారాష్ట్రలో భారీగా మాదకద్రవ్యాలు లభించాయి. పాల్ఘర్ జిల్లాలో అధికారులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.5 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ వివరాలను పోలీసులు వెల్లడించారు.

*బాలికపై అత్యాచారయత్నం ఘటన దాచేపల్లి మండలం కేశానుపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు గ్రామానికి చెందిన 18 ఏళ్ల యువకుడు ఇంటి దగ్గర ఆడుకుంటున్న బాలికను పట్టుకున్నాడు. బాలిక భయంతో కేకలు వేయటంతో చుట్టు పక్కల వారు దగ్గరకు రావడంతో ఆ యువకుడు పాపను వదిలేసి పారిపోయాడు. సమాచారం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీస్టేషనలో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై దాచేపల్లి పోలీసులను సంప్రదించగా తమకు ఇంతవరకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు.

*పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని ఉలిమెల్ల గ్రామ పొలాల్లో కాచి ఉంచిన 1500లీటర్ల నాటుసారా ఊట ధ్వంసం చేసినట్లు ఎస్‌ఐ గోపీనాథ్‌రెడ్డి తెలిపారు. శనివారం పులివెందు ల డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ భాస్కర్‌రెడ్డిల ఆదేశాల మేరకు ఉలిమెల్ల గ్రామ పొలాల్లో దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడుల్లో చీకిచెట్ల మాటున ఐదు డ్రమ్ములలో కాచి ఉంచిన 1500 లీటర్ల నాటుసారా ఊట ఉండగా సిబ్బందితో కలిసి ధ్వంసం చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

*తనను అవమానించారని మనస్తాపానికి గురైన ఓ బాలి క ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నెక్కొండలో ఆదివారం చోటు చేసుకుంది.
*ఒడిశా రాష్ట్రం కలహండీ జిల్లాలో శనివారం బాంబు(ఐఈడీ) పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ప్రముఖ పత్రిక జర్నలిస్టు, ఫొటోగ్రాఫర్‌ రోహిత్‌కుమార్‌ బిశ్వాల్‌(46) మరణించాడు. భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు ఈ బాంబుపేలుడుకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

*విద్యబుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే కామంతో కండ్లు మూసుకుపోయి ఓ చిన్నారిపట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. వివరాల ప్రకారం… పాతబస్తీలోని ఫలక్‌నుమా ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలలో ఆశ్వక్‌ అహ్మద్‌ ఖాన్‌ (35) 2015 నుంచి ఎస్‌జీటీ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇదిలా ఉండగా శనివారం పాఠశాలలో సుమారు 8.30 గంటలకు సమయంలో అదే పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న 10 సంవత్సరాల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడటమే కాకుండా బాలిక వీపుపై విచక్షణారహితంగా కొట్టాడు.

*వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో శనివారం పోలీసులు పెద్ద ఎత్తున ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకుని ఐదుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. మూడు వాహనాలను సీజ్‌ చేశారు. వైఎస్సార్‌ జిల్లా కాశినాయన మండలం ఆకులనారాయణ పల్లి సమీపంలోని అడవుల్లో నిందితులు ఎర్రచందనం చెట్లను నరికి, దుంగలుగా తయారుచేసి వాహనాల్లోకి ఎక్కించి తరలించడానికి సిద్ధంగా ఉంచారు. ఆ సమయంలో పోరుమామిళ్ల సీఐ రమేష్‌బాబు, ఎస్‌ఏ కాశినాయన ఎస్‌ఐ అరుణ్‌రెడ్డి తమ సిబ్బందితో దాడి చేసి నలుగురిని అరెస్ట్‌ చేశారు.

*నర్సీపట్నం గబ్బాడ సమీపం నెల్లిమెట్ట వద్ద నర్సీపట్నం రూరల్‌ పోలీసులు శనివారం గంజాయి పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ఎస్‌ఐ ఎస్‌. రమేష్‌ తెలిపిన వివరాలివి. ముందస్తు సమాచారం మేరకు నెల్లిమెట్ట జంక్షన్‌ వద్ద వాహన తనిఖీలు చేపట్టామన్నారు. ఇంతలో ఓ లారీ రావాడాన్ని గుర్తించి ఆపగా, డ్రైవర్‌ పరారయ్యాడన్నారు. లారీలో చూడగా, 1,100 కిలోల గంజాయి మూటలు బయట పడినట్టు చెప్పారు. వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని, లారీని సీజ్‌ చేసి కేసు నమోదు చేశామన్నారు

*అమలాపురం శివారు గాంధీనగర్‌ సమతానగర్‌లో నివాసం ఉంటున్న నక్కా శివప్రసాద్‌(36) శనివారం ఇంట్లోనే ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శివప్రసాద్‌కు 12ఏళ్ల క్రితం వివాహమైంది. హైదరాబాద్‌లో ఉపాధి పొంది శివప్రసాద్‌ ఇటీవల అమలాపురం చేరుకుని రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇండ్లో ఎవరూలేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల శివప్రసాద్‌ కొందరు వ్యక్తులతో గొడవపడినట్టు సమాచారం.భార్య సుబ్బలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమలాపురం పట్టణ సీఐ ఆర్‌ఎస్‌కే బాజీలాల్‌ ఆధ్వర్యంలో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

*రఘునాథపాలెంలో పట్టపగలే ఓ ఇంట్లో చోరీ జరిగిది. బాధితుడి వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన పిట్ల రంగయ్య సుతారి పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. ఈ క్రమంలో శనివారం పని నిమిత్తం భార్యను తీసుకొని ఖమ్మం వెళ్లాడు.

* బయ్యారం మండలం నారాయణపురం గ్రామ కార్యదర్శి వెంకటేష్ రెండో రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేశాడు. అధికారులు, ప్రజాప్రతినిధుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కలెక్టర్‎కి లేఖ రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం పాల్పడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వెంకటేష్ ఆదివారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో కార్యదర్శి వెంకటేష్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

*తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ రూరల్ బోట్‌ క్లబ్‌లో ఇద్దరు చిన్నారులు గల్లంతయ్యారు. బోట్‌క్లబ్ చెరువులో సరదాగా చేపలకు గాలం వేస్తూ పిల్లలు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న సర్పవరం పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నారుల కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.