DailyDose

ఈడీ దృష్టికి కేసినో వ్యవహారం – TNI తాజా వార్తలు 08/02/2022

ఈడీ దృష్టికి కేసినో వ్యవహారం TNI తాజా వార్తలు 08/02/2022

* గుడివాడ కేసినో వ్యవహారం ఎంత రచ్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు పుట్టించింది. కాగా.. నేడు ఈ కేసినో వ్యవహారాన్ని టీడీపీ నేతలు ఈడీ దృష్టికి తీసుకెళ్లారు. ఢిల్లీలో టీడీపీ నేతలు రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్, ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఈడీ అధికారులను కలుసుకున్నారు. కేసినో నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

* సూర్యాపేట జిల్లాలోని జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామంలో తెలంగాణలో తొలి సూర్య క్షేత్రం అఖండ జ్యోతి స్వరూప సూర్యనారాయణ దేవస్థానంలో.. రథసప్తమి సందర్భంగా మంత్రి జగదీష్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ కుమార్‌ ప్రత్యేక పూజలు చేశారు.

* మీడియా వన్ టీవీ చానల్ లైసెన్స్‌ను రద్దు చేస్తూ సమాచారప్రసార శాఖ మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశాలను కేరళ హైకోర్టు సమర్థించింది. కొజిక్కోడ్‌లోని మాధ్యమమ్ బ్రాడ్‌కాస్టింగ్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ తీర్పు ఇచ్చింది. ఈ సంస్థ ఉద్యోగులుకేరళ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం దాఖలు చేసిన పిటిషన్లను తోసిపుచ్చింది.

* క‌రోనా నేప‌థ్యంలో 2020లో తొలిసారి లాక్‌డౌన్ విధించిన స‌మ‌యంలో.. ఆ వైర‌స్ వ్యాప్తికి కాంగ్రెస్ కార‌ణ‌మ‌య్యిందంటూ ప్ర‌ధాని మోదీ సోమ‌వారం లోక్‌స‌భ‌లో ఆరోపించిన విష‌యం తెలిసిందే. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ స‌ర్కార్‌తో పాటు మ‌హారాష్ట్రలో శివ‌సేన కూడా వ‌ల‌స కార్మికుల‌ను స్వంత ఇండ్ల‌కు పంపించే ఏర్పాట్లు చేసింద‌న్నారు. అయితే ఆ ఆరోప‌ణ‌ల‌ను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కొట్టిపారేశారు. వ‌ల‌స కార్మికుల త‌ర‌లింపుపై ప్ర‌ధాని మోదీ అన్ని అబద్ధాలు చెబుతున్నట్లు కేజ్రీ ఆరోపించారు. లోక్‌స‌భ‌లో ప్ర‌ధాని మోదీ చేసిన ప్ర‌క‌ట‌న అబ‌ద్ధ‌మ‌ని, ప్ర‌జ‌ల జీవితాల‌తో రాజ‌కీయాలు చేయ‌డం స‌రికాదు అని ఆయ‌న అన్నారు. క‌రోనా స‌మ‌యంలో ఇబ్బందులుప‌డ్డ వారి ప‌ట్ల ప్ర‌ధాని మోదీ సున్నితంగా వ్య‌వ‌హ‌రించాల‌ని దేశం ఆకాంక్షిస్తోంద‌ని ఆమ్ ఆద్మీ చీఫ్ అన్నారు. హిందీలో ట్వీట్ చేసిన కేజ్రీవాల్‌.. ప్ర‌ధాని వ్యాఖ్య‌ల‌ను ఖండించారు. ఫ‌స్ట్ వేవ్ స‌మ‌యంలో ముంబైలో కాంగ్రెస్ నేత‌లు వ‌ల‌స కూలీల‌కు టికెట్లు ఇచ్చి సొంతూళ్ల‌కు వెళ్ల‌గొట్టార‌ని, దీంతో క‌రోనా వ్యాప్తి జ‌రిగిన‌ట్లు మోదీ ఆరోపించారు.ఢిల్లీలో కూడా ప్ర‌జ‌లు ఊళ్ల‌కు వెళ్లేందుకు బ‌స్సుల‌ను స్థానిక ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన‌ట్లు ప్ర‌ధాని చెప్పారు. ప్ర‌ధాని వ్యాఖ్య‌లు దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని మ‌హారాష్ట్ర రెవ‌న్యూ మంత్రి బాలాసాహ‌బ్ థోర‌ట్ ఆరోపించారు.

* మ‌హాభార‌త్ సీరియ‌ల్‌లో భీముడి పాత్ర పోషించిన న‌టుడు ప్ర‌వీణ్ కుమార్ సోబ్తీ క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 75 ఏళ్లు. ప్ర‌వీణ్ కుమార్‌ మ‌ర‌ణించిన‌ట్లు ఆయ‌న కుమార్తె నికునికా వెల్ల‌డించారు.

* భారత్ లో తగ్గిన కరోనా కేసులు పెరిగిన మరణాలు కొత్తగా 67,597 కరోనా కేసులు నమోదు..దేశంలో కరోనా మహమ్మారి అదుపులోకి వస్తోంది. గడిచిన 24 గంటల్లో 13,46,534 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 67,597 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు మంగళవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,23,39,611కి చేరింది. నిన్న1,188 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,04,062కి చేరింది.

* ఏపీ ప్రజలకు శుభవార్త 2.85లక్షల మంది బ్యాంక్ ఖాతాల్లోకి తలా రూ.10వేలు నేడే కరోనా విలయం కొనసాగుతున్నా, పీఆర్సీ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనబాట పట్టినా పేద ప్రజల సంక్షేమం విషయంలో మాత్రం వెనుకడుగు వేసేదేలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాటుకుంటున్నారు. ప్రతిష్టాత్మక జగనన్న చేదోడు పథకం కింద మంగళవారం నాడు లక్షల మంది లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా రూ.10వేలు జమ చేయనున్నారు.

* కేరళ బంగారం స్మగ్లింగ్ కేసులో కీలక నిందితురాలైన స్వప్నా సురేష్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది.స్వప్నా సురేష్ బుధవారం కీలక పత్రాలతో ఈడీ కార్యాలయంలో విచారణకు రావాలని ఈడీ సమన్లలో కోరింది. ఈ కేసు విషయంలో యూఏఈ కాన్సులేట్ ప్రభుత్వంతో ముఖ్యమంత్రి మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీకేసులో నిందితుడైన ఎం శివశంకర్ సంప్రదింపులు జరిపారని స్వప్నా ఆరోపించారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి అనుకూలంగా ఆడియో క్లిప్‌ను విడుదల చేయాలని శివశంకర్ పట్టుబట్టారని స్వప్న చేసిన ఆరోపణలను కూడా ఈడీ పరిశీలిస్తోంది. సీఎంఓకి క్లీన్ చిట్ ఇచ్చిన ఆమె ఆడియో క్లిప్ ను శివశంకర్‌తో సన్నిహితంగా ఉండే వ్యక్తుల సలహా మేరకు రూపొందించినట్లు స్వప్న తెలిపారు.

* అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం జరిగిన విరాళాల సేకరణలో తెలంగాణ అగ్రభాగాన నిలిచిందని, అదే స్ఫూర్తితో సూక్ష్మ విరాళాల సేకరణలోనూ ముందు నిలవాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు.

*హైదరాబాద్‌ రాష్ట్రంలోని ఎంబీబీఎస్, బీడీఎస్‌ వైద్య విద్య కోర్సుల్లో యాజమాన్య కోటాలో ప్రవేశాలకుగాను ఆన్‌లైన్‌ దరఖాస్తుల నమోదుకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్లకు నమోదు చేసుకోవాలన్నారు. యాజమాన్య కోటాలో సీట్ల భర్తీకి అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఈ నెల 6వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నారు.

*రామానుజాచార్యులు గొప్ప విప్లవకారుడని జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆయన ముచ్చింతల్‌లోని సమతామూర్తి విగ్రహాన్ని ఆదివారం సందర్శించారు. విగ్రహం చుట్టూ ఉన్న 108 దివ్యదేశాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి విశేషాలను తెలుసుకున్నారు. పవన్‌ కల్యాణ్‌ను చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. పవన్‌ కల్యాణ్‌తో పాటు మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌కు చినజీయర్‌స్వామి మంగళాశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు. భవిష్యత్‌లో రామానుజాచార్యుల స్ఫూర్తిని ముందుకు తీసుకు వెళ్లేందుకు కృషి చేస్తానని చెప్పారు.

*లక్షన్నర కడితే దుబాయిలో ఉద్యోగం, మంచి జీతం అన్నాడు. మన ఊరి వాడే కదా.. అని నమ్మిన 15 మంది యువకులు అప్పుచేసి మరీ రూ.2.25 కోట్లు చేతిలో పెడితే నట్టేట ముంచాడు.

*రాష్ట్ర ప్రభుత్వం చర్చల పేరుతో సమ్మె విరమణ చేయించుకుని పైచేయి సాధించింది. ఈ ఒప్పందం నాయకులకు చ్చినా ఉద్యోగుల ఆశలు అడియాశలు అయ్యాయి. రాష్ట్ర పీఆర్సీల చరిత్రలో జగన్‌రెడ్డిది పంగనామాల పీఆర్‌సీ. ఈ పీఆర్సీలో ఉద్యోగులకు జరిగిన నష్టం… ఎన్ని పీఆర్‌సీలు వచ్చినా రికవరీ కాదు’’ అని ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు విమర్శించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ స్పందిస్తూ ‘‘మంత్రుల సబ్‌కమిటీ పేరుతో పెద్ద నాటకమే నడిచింది. ప్రభుత్వానికి మేలు జరిగింది తప్ప ఉద్యోగులకు పెనునష్టమే. 23 శాతం పీఆర్‌సీలో మార్పు కోసం మంత్రుల కమిటీ అంగీకరించకపోవడం అప్రజాస్వామికం

*ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో పీఆర్సీ సాధన సమితి విఫలమైన నేపథ్యంలో.. ప్రస్తుత జేఏసీ నుంచి విడిపోయి కొత్త జేఏసీని ఏర్పాటుచేసి పోరాటాన్ని కొనసాగించాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాఫ్టో) నిర్ణయించింది.