Kids

KIDS: దుష్టుడితో సావాసం!

KIDS: దుష్టుడితో సావాసం!

ఒక ఊరిలో రాజు అనే నిజాయితీ పరుడుండేవాడు. ఒకరోజు కట్టెలు కొట్టడానికి అడవికెళ్తున్నాడు. మార్గమధ్యంలో ఓ బావిలో ఏదో అలికిడి వినిపించింది. దగ్గరికెళ్లి చూస్తే సింహం, మనిషి, సర్పం ఉన్నాయి. ‘దయచేసి కాపాడండి’ అంటూ కేకలేశారు. ‘కాపాడితే తినేస్తుంది సింహం. కాటేస్తుంది పాము’ అనుకున్నాడు. మనిషిని కాపాడాలనుకున్నాడు. ‘హాని చేయమ’ని ఒట్టు వేశారు ముగ్గురు. వారి బాధచూడలేక మంచోడయిన రాజు అందరినీ బయటికి తీసుకొచ్చాడు. ‘ఎప్పుడేం కావాలన్నా మమ్మల్ని మరవకండి మిత్రమా’ అంటూ సర్పం, సింహం చెప్పుకొచ్చాయి. ఆ మనిషి మాత్రం.. ‘నా పేరు విక్రమార్కుడు. రాజుగారి దగ్గర కంసాలిగా పని చేస్తున్నా’ అన్నాడు. ‘థ్యాంక్స్‌’ చెప్పి ఎవరి దారిన వాళ్లు వెళ్లారు. ఆర్నెళ్ల తర్వాత రాజు ఓ పనిమీద అడవికి వెళ్తోంటే.. సింహం ఎదురైంది. ‘ఇంటికి రా మిత్రమా..’ అంటూ పిలుచుకెళ్లింది. మర్యాదలు చేయడంతో పాటు బంగారం ముద్దను ఇచ్చింది. కాదనలేక తీసుకున్నాడు. కంసాలి మిత్రుడు గుర్తొచ్చి వాళ్ల ఊరికెళ్లాడు రాజు. ఆ బంగారం ముద్దను చూసి విక్రమార్కుడికి అసూయపుట్టింది. బంగారాన్ని కరిగించి.. అందమైన నాణేలను తయారు చేశాడు. ఆ నాణేలపై రాజుగారి బొమ్మ వేశాడు. మరుసటి రోజు ‘చూడు రాజు.. ఇక్కడే ఇంకో రెండు రోజులుండు. మంచి మాంసాహారం తీసుకొస్తా’ అని బయటికెళ్లాడు విక్రమార్కుడు. రాజు హాయిగా పడుకుని ఆలోచిస్తున్నాడు. ఇంతలో సైనికులొచ్చి రాజును లాకెళ్లారు. బంగారు నాణేలను తీసుకున్నారు. జైల్లో వేశారు. ఇలా ఎందుకని రాజు అడిగాడు వారిని. ‘నువ్వు దొంగవు. నాణేలు దొంగతనం చేశావు’ అన్నారు. రాజుకి కళ్లు తిరిగినంత పనైంది.