Movies

ఎవరైనా ఇష్టపడతారు

ఎవరైనా ఇష్టపడతారు

తనకు అవకాశం వస్తే కనుక జూనియర్ ఎన్టీఆర్ , అల్లు అర్జున్లలతో కలిసి సినిమాలు చేయాలని వుందంటున్నది దీపికా పడుకొనె . ” వాళ్ళ వ్యక్తిత్వం , నటించే తీరు చూశాక వాళ్ళతో కలిసి తెరపంచుకోవాలని ఎవ్వరైనా ఇష్టపడతారు. నేనూ అదే కోరుకుంటున్నా. భవిష్యత్తులో అవకాశం వస్తుందేమో చూడాలి ” అంటూ నవ్వేసింది. ఈమె హ్యాండ్ బ్యాగ్ సూదీ, దారం, పిన్నులూ వుంచుకుంటుందట . “ఎందుకంటే రణవీర్ ఎప్పుడూ రకరకాల ఫ్యాషన్లు ప్రయత్నిస్తుంటాడు. ఎక్కడికి వెళ్ళినా సరదాగా గెంతులు వేస్తుంటాడేమో, డ్రెస్లు చిరుగుతుంటాయి ” అంటూ మరోమారు నవ్వుల మొగ్గ అయింది దీపికా పడుకొనె.