Food

తెలంగాణ నాటు..ఘాటు!

తెలంగాణ నాటు..ఘాటు!

కారం, మసాలా, అల్లం వెల్లుల్లి దట్టించిన తెలంగాణ వంటలకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. సంప్రదాయ తెలంగాణ వంటకాలకు ఆధునికతను జోడించి అందిస్తున్నది.. తెలంగాణ స్పైస్‌ కిచెన్‌. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఈ రెస్టారెంట్‌లో ఎల్లిపాయకారం రొయ్యలు, కొర్రమీను పులుసు, పప్పుచారు అన్నం, నాటుకోడి రోస్ట్‌ వంటి మనవైన వంటకాలను రుచి చూడవచ్చు. నాటుకోడి పులుసు-చిల్లుగారె రెస్టారెంట్‌ స్పెషల్‌ వంటకం. వెజ్‌, నాన్‌-వెజ్‌ రెండూ సిద్ధం. అంతేకాదు బెల్లం, మిరియాలు, యాలకులతో చేసిన పానకాన్నీ ట్రై చేయొచ్చు. తెలంగాణ పల్లెల్లో కనిపించే అందమైన వాతావరణాన్ని కూడా ఇక్కడ ఆస్వాదించవచ్చు.