Politics

రాజా కసుకుర్తి ఆధ్వర్యంలో జంక్షన్లో తానా రైతు కోసం విజయవంతం

రాజా కసుకుర్తి ఆధ్వర్యంలో జంక్షన్లో తానా రైతు కోసం విజయవంతం

1501221d-376f-4f4a-a957-c11a7b0d8e17
038b8f96-373d-42ac-9b2f-a7a0d0f8be23
aplikasi cek keyboard laptop
ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో తానా చైతన్యస్రవంతి కార్యక్రమంలో భాగంగా డిసెంబర్‌ 21వ తేదీన కృష్ణా జిల్లాలోని హనుమాన్‌ జంక్షన్‌ పాలశీతలీకరణ కేంద్రంలో కృష్ణా మిల్క్‌ యూనియన్‌తో కలిసి నిర్వహించిన కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరితోపాటు, చైతన్యస్రవంతి కో ఆర్డినేటర్‌ సునీల్‌ పంత్రా, కమ్యూనిటీ సర్వీసెస్‌ కో ఆర్డినేటర్‌ రాజా కసుకుర్తి, కృష్ణా మిల్స్‌ యూనియన్‌ చైర్మన్‌ చలసాని ఆంజనేయులు, ముఖ్య అతిధిగా రామ్‌ వెనిగళ్ళ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు గడ్డి కత్తిరించు యంత్రాలను రక్షణ పరికరాలను అందజేశారు. నేత్ర వైద్యశిబిరాన్ని నిర్వహించి కంటి పరీక్షలను నిర్వహించారు. రైతు నెక్కంటి సుబ్బారావును సన్మానించారు. 
fbc34786-9a27-4bc6-898d-69f7d7aad14a
mouse test
4f4c9973-eb49-4b4f-82a0-ff7ed76cb7e1

ఈ సందర్భంగా తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి మాట్లాడుతూ, తామంతా రైతు బిడ్డలమేనని తమ తల్లితండ్రులు వ్యవసాయం చేస్తున్నప్పుడు పడిన కష్టాలు తమకు ఇంకా గుర్తుందని రైతు కష్టంతో తామంతా చదివి ఇప్పుడు అమెరికాలో ఉన్నప్పటికీ రైతులకు ఏదైనా మేలు చేయాలన్న ఉద్దేశ్యంతో తానా తరపున రైతుకోసం పలు కార్యక్రమాలను చేపట్టామని చెప్పారు. జిల్లాలో పాడిపరిశ్రమను నిర్లక్ష్యం చేస్తున్నారని, ప్రస్తుతం గడ్డిని పండిరచేవాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోవడం బాధగా ఉందని అంటూ, రైతులకు గడ్డిని కోసే యంత్రాలను అందించడం ద్వారా వారి కష్టాలను తగ్గించే ప్రయత్నాన్ని తానా తరపున చేస్తున్నామని చెప్పారు. పాడిపరిశ్రమ అభివృద్ధికి రైతులంతా ముందుకు వచ్చి సహకరించాలని కోరారు. పాడిపరిశ్రమ అభివృద్ధికి కృష్ణా మిల్క్‌ యూనియన్‌ బాగా పనిచేస్తోందని ప్రశంసించారు.   
54fcabad-5735-4223-8646-c1502d07f506
తానా కమ్యూనిటీ సర్వీసెస్‌ కో ఆర్డినేటర్‌ రాజా కసుకుర్తి మాట్లాడుతూ, తామంతా రైతు పడిన కష్టాలను స్వయంగా చూసినవారమని, మా నాన్న వ్యవసాయం చేసినప్పుడు పడ్డ కష్టం, మా అమ్మ పాలు అమ్మి మమ్మల్ని చదివించిన సంగతిని గుర్తు చేసుకుంటూ, జిల్లాలో పాడిపరిశ్రమ అభివృద్ధికి, రైతు బాగుకోసం తామంతా కృషి చేస్తున్నామని, తానా తరపున రైతు సహాయ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.
కృష్ణా జిల్లా మిల్స్‌ యూనియన్‌ చైర్మన్‌ చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ, అమెరికాలో స్థిరపడినా రైతు కుటుంబానికి చెందిన వీళ్ళంతా ఇక్కడకు వచ్చి రైతులకు సహాయం అందించడం ఎంతో ప్రశంసనీయమైన విషయమని చెప్పారు. వారికి కూడా మనవంతు సహకారాన్ని అందించాలని కోరారు. 
5f1ca27f-e422-4f30-a6de-dc207c9a2ae2
68522f3f-775c-4a52-b868-3ba1452a9409
రాజా కసుకుర్తి ఆధ్వర్యంలో జంక్షన్లో తానా రైతు కోసం విజయవంతం
test my keyboard
ఈ కార్యక్రమంలో తానా కార్యదర్శి సతీష్‌ వేమూరి,ఫౌండేషన్ కార్యదర్శి శశికాంత్‌ వల్లేపల్లి, పురుషోత్తం చౌదరి, శశాంక్‌ యార్లగడ్డ, రఘు ఎదులపల్లి, వెంకట రమణ గన్నె, ఠాగూర్‌ మలినేని, శ్రీనివాస్‌ కూకట్ల, జోగేశ్వరరావు పెద్దిబోయిన, ప్రశాంత్‌ కాట్రగడ్డ, విష్ణు దోనెపూడి తదితరులు పాల్గొన్నారు.
d8217a52-1df8-4b45-a440-906682928808