Agriculture

అధికార పార్టీ నేతల కనుసన్నల్లో.. కోడిపందాలకు భారీ ఏర్పాట్లు

అధికార పార్టీ నేతల కనుసన్నల్లో.. కోడిపందాలకు భారీ ఏర్పాట్లు

ఏపీ:రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కోడి.. పందాలకు బరి తెగింపు ఏర్పాట్లు.

కోడిపందేలకు బరులు మావే ఉండాలి.. మేం చెప్పినవాళ్లకే అనుమతి వ్వాలంటూ..పట్టు బడుతున్న పలు రాజకీయ పార్టీల నాయకులు.

ఈ విషయంలో అధికారులూ కిమ్మనడం లేదు.

భీమవరంలో కలెక్టరేట్‌కు అతి చేరువలోనే తాడేవు వద్ద 20 ఎకరాల్లో కోడి పందాలకు ఏర్పాట్లు.

స్థానికంగా ఓ ఎంపీపీ కోడిపందేలకు బరులు సిద్ధం చేస్తున్నా..చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం.

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు.. బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో కొన్ని చోట్ల ఇప్పటికే బరులు సిద్ధం చేస్తున్న కోడి పందాల నిర్వాహకులు.