DailyDose

తెలుగు రాష్ట్రాల మధ్య పరుగులు పెట్టనున్న తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్

తెలుగు రాష్ట్రాల మధ్య పరుగులు పెట్టనున్న  తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్

రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ మధ్య వేగవంతమైన కనెక్టివిటీని అందిస్తున్న తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్

హైదరాబాద్ : వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 15 జనవరి 2023 న సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వరకు నడపబడుతుంది. ఈ రైలు వారంలో 6 రోజులు నడుస్తుంది. భారతీయ రైల్వే యొక్క గర్వించదగ్గ రైలు సర్వీస్ – వందే భారత్ ఎక్స్‌ప్రెస్ – మకర సంక్రాంతి శుభదినమైన జనవరి 15 న రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తన రైలు కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. ప్రారంభ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రిమోట్ వీడియో లింక్ ద్వారా జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ రైలు సికింద్రాబాద్ స్టేషన్ నుండి విశాఖపట్నం వరకు నడుస్తుంది
రైలు యొక్క సాధారణ సేవలు జనవరి 16 నుండి ప్రారంభమవుతాయి. దీని కోసం బుకింగ్‌లు జనవరి 14 నుండి ప్రారంభమవుతాయి. ట్రైన్ నంబర్ 20833 విశాఖపట్నం – సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 05.45 గంటలకు ప్రారంభమై 14.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. రైలు నంబర్ 20834 సికింద్రాబాద్ – విశాఖపట్నం సికింద్రాబాద్ నుండి 15.00 గంటలకు బయలుదేరి 23.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణించే మార్గంలో ప్రధాన స్టేషన్ లు రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్‌ స్టేషన్లలో ఈ రైలు రెండు వైపులా ఆగుతుంది. ఈ రైలులో 14 ఏ.సి చైర్ కార్ కోచ్‌లు, 1128 మంది ప్రయాణికుల సామర్థ్యంతో రెండు ఎగ్జిక్యూటివ్ ఏ .సి చైర్ కార్ కోచ్‌లు ఉన్నాయి. ఈ రైలు, రెండు స్టేషన్ల (సికింద్రాబాద్ -విశాఖపట్నం ) మధ్య అత్యంత వేగవంతమైన ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తుంది. ప్రత్యేకమైన రిజర్వ్డ్ సిట్టింగ్ వసతిని కలిగి ఉంటుంది. ఈ రైలు అధికారిక పర్యటనలు, వ్యాపార ప్రయోజనం, తక్కువ వ్యవధిలో పర్యటనలు వంటి అత్యవసర అవసరాలపై ప్రయాణించే ప్రజల అవసరాలకు ఈ రైలు ప్రయాణ సౌలభ్యాన్ని అందిస్తుంది.

ఈ రైలు ఆధునిక ఫీచర్లు

మెరుగైన సౌకర్యాలతో కూడిన స్వదేశీ సాంకేతికతతో తయారు చేయబడింది. రైలు ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్‌లను కలిగి ఉంది, అన్ని తరగతులలో ఏటవాలుగా ఆనుకొనే సౌకర్యవంతమైన సీట్లు, ఎగ్జిక్యూటివ్ తరగతిలో 180 డిగ్రీల కోణంలో తిరిగే సీట్లు అమర్చబడి ఉన్నాయి. అత్యవసర అలారం బటన్, ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ యూనిట్‌లు ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా ప్రయాణికులు అత్యవసర పరిస్థితుల్లో సిబ్బందితో మాట్లాడవచ్చు. భద్రమైన మరియు సురక్షితమైన ప్రయాణానికి అన్ని కోచ్‌లలో ( నిఘా ) సి సి టివి కెమెరాలను అమర్చారు. ఈ రైలు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే ప్రజలకు సురక్షితమైన, అనుకూలమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని పగటి సమయాల్లో అందిస్తుంది. ఇతర రవాణా మార్గాలతో పాటు ఇతర ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పోల్చినప్పుడు ఇది వేగవంతమైన ప్రయాణ ఎంపిక అని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబందాల అధికారి
సి హెచ్ .రాకేష్ తెలిపారు.