NRI-NRT

సింగపూర్ కాకతీయ సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు.

సింగపూర్ కాకతీయ సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు.



భావితరాలకు తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు, విలువలు, పండుగల ప్రాశస్త్యముల గురించి తెలియచేయాలనే ఉద్దేశ్యంతో సొంత నేలకు దూరంగా సింగపూరునందు నివశిస్తున్న కాకతీయ సాంస్కృతిక పరివారం సభ్యులందరూ కలిసి సింగపూరు యూనివర్సిటీ అఫ్ టెక్నాలజీ & డిజైన్ (SUTD) నందు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. దాదాపు 550కి పైగా కాకతీయ సాంస్కృతిక పరివారం సభ్యులు హాజరయిన ఈ కార్యక్రమంలో పిల్లల మరియు పెద్దల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సంక్రాంతి పండుగ విశిష్టతతో పాటు ఆ 4 రోజులూ జరుపుకునే పండుగ సాంప్రదాయాల వెనుక దాగిఉన్న విషయాలను అతి చక్కగా పిల్లలకు వివరించారు. సంస్థ అధ్యక్షులు శ్రీ రాంబాబు పాతూరి మాట్లాడుతూ సంస్థ స్థాపించబడి 3 సంవత్సరాలు అయిందని, కోవిడ్ తదనంతరం తమ సంస్థ ఇంత మంది తెలుగు వారితో కలిపి జరుపుకుంటున్న 2వ అతి పెద్ద పండుగ ఇది అని వివరించారు. ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరుపుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రావడం ద్వారా మరింత మంది సాటి తెలుగు వారు సన్నిహుతులు అయ్యారని అలాగే విభిన్నమైన ఆటలద్వారా ఒకరితో ఒకరికి పరిచయాలు పెంచుకునేలా రూపొందించిన కార్యక్రమ రూపకల్పన చక్కగా ఉంది అని పలువురు ప్రశంసించారు.