Devotional

నేటి మీ రాశి ఫలితాలు

నేటి మీ రాశి ఫలితాలు

🕉️హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
*✍🏻 *17.02.2023 ✍🏻**
*🗓 *నేటి రాశి ఫలాలు 🗓**

🐐 మేషం
ఈరోజు (17-02-2023)
ఈమేష రాశి వారికి ఈ రోజు మధ్యస్థముగా ఉన్నది. మేష రాశి వారికి ఈ వారం ఒత్తిళ్ళు అధికముగా ఉండును. పనులయందు చికాకులు, మాట పట్టింపులు ఏర్పడును. జన్మ స్థానము రాహువు ద్వితీయ స్థానమునందు కుజుని ప్రభావంచేత మేషరాశి వారు గొడవలకు దూరంగా ఉండాలి. ఆవేశపూరిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. భాగ్యములో బుధుడు, దశమంలో రవి ప్రభావము చేత ఆలోచించి తీసుకునే నిర్ణయాలు శుభఫలితాలను కలుగచేస్తాయి. మేషరాశి వారికి లాభ స్థానమునందు శని శుక్రుల సంచారముచేత చేసే ప్రతీ పని అనుకూలించును. వ్యయస్థానమునందు గురుని ప్రభావంచేత ఖర్చులు అధికముగా ఉండును. మేషరాశి ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలు ఉన్నప్పటికి ఉద్యోగములో పని ఒత్తిడి పెరుగును. వ్యాపారస్తులకు అనుకూల ఫలితాలున్నాయి. స్త్రీలు కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. మేషరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని పూజించడం, ఆవునేతితో దీపాన్ని వెలిగించడం శుభ ఫలితాలను కలిగిస్తాయి.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం
ఈరోజు (17-02-2023)

వృషభ రాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. జన్మరాశి యందు కుజుడు, అష్టమ బుధుని ప్రభావంచేత వృషభరాశి వారు ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. ఆవేశపూరిత నిర్ణయాలకు పౌరుషం పట్టుదలకు దూరంగా ఉండాలని సూచన. జన్మరాశి యందు కుజుని ప్రభావంచేత కుటుంబము, స్నేహితులతో భేదాభిప్రాయములు వాగ్వివివాదములు ఏర్పడు సూచనలు కలుగుచున్నాయి. వివాదాలకు దూరంగా ఉండాలని సూచన. జన్మరాశి యందు కుజుని ప్రభావంచేత ఒత్తిళ్ళు వేదనలు అధికముగా ఉండును. వృషభరాశివారికి లాభమునందు గురుడు, దశమము నందు శని, శుక్రుల ప్రభావం చేత ఆర్ధికపరంగా లాభము చేకూరును. దశమములో శని, శుక్రుల అనుకూలత వలన ఉద్యోగులకు లాభదాయకముగా ఉండును. వృషభరాశి వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలించును స్త్రీలకు మానసిక వేదన, ఆరోగ్య సమస్యలు అధికముగా ఉండును. వృషభరాశి వారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం కృష్ణాష్టకము, లక్ష్మీదేవిని ఆరాధించడం వలన శుభములు కలుగును
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం
ఈరోజు (17-02-2023)

మిథున రాశివారికి ఈ రోజు మధ్యస్థముగా ఉంది. మిథున రాశి వారికి అష్టమ రవి, వ్యయస్థానమునందు కుజుని ప్రభావం చేత కుటుంబమునందు వివాదములు, అనారోగ్య సమస్యలు వేధించును. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. భాగ్యమునందు శని శుక్రుల ప్రభావంచేత వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాల్లో మానసిక ఆందోళనలు వేదనలు అధికముగా ఉండును. దశమములో గురుని ప్రభావంచేత ఉద్యోగస్తులకు మధ్యస్థ ఫలితాలు, వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలు కలుగుతున్నాయి. దశమంలో గురుడు, లాభములో రాహువు అనుకూల ప్రభావంచేత సమస్యలను, ఒత్తిళ్ళను నేర్పుతో అధిగమించెదరు. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. మిథున రాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది. లక్ష్మీ సహస్రనామాన్ని పఠించండి.
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం
ఈరోజు (17-02-2023)

కర్కాటక రాశి వారికి ఈ రోజు చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించవలసిన సమయము. కర్కాటక రాశివారికి కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు వేధించును. నూతనముగా వస్తువులను కొనడానికి ప్రయత్నించెదరు. అష్టమ స్థానము శని సంచరించుట చేత కుటుంబము విషయాలు, కోర్టు వ్యవహారాలు, ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. గురు, కుజ, రాహు గ్రహాల అనుకూల ప్రభావం చేత ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలు ఏర్పడును. స్త్రీలు ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలని సూచన. కర్కాటక రాశివారు ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందాలంటే ఆవునేతితో దీపారాధన చేస్తూ లక్ష్మీదేవిని పూజించాలి.
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం
ఈరోజు (17-02-2023)

సింహరాశి వారికి ఈ రోజు మధ్యస్థమునుండి అనుకూల ఫలితాలున్నాయి. అష్టమ గురుని ప్రభావం చేత ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. సింహరాశి వారికి భాగ్యములో రాహువు, అష్టమ స్థానములో గురుని ప్రభావం చేత ఆరోగ్యపరమైనటువంటి విషయాలయందు, కుటుంబ విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. కళత్ర స్థానము నందు శని శుక్రుల ప్రభావంచేత కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఈ వారం ఉద్యోగ వ్యాపారాలయందు అనుకూల ఫలితములు అధికముగా కనబడుచున్నవి. విద్యార్థులకు అనుకూలమైనటువంటి వారం. స్త్రీలకు ఈ రోజు అనుకూలముగా ఉన్నది. సింహరాశి మరింత శుభఫలితాలు పొందడం కోసం లక్ష్మీ అష్టకాన్ని పఠించి ఆవునేతితో దీపారాధన చేయడం మంచిది.
🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య
ఈరోజు (17-02-2023)

కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉన్నది. కన్యారాశికి భాగ్యమునందు కుజుడు, సప్తమ స్థానము నందు గురుడు, ఆరవ స్థానము నందు శని శుక్రుల ప్రభావంచేత ఈ రోజు చేసే ప్రతీ పని అనుకూలించును. ధనలాభము, కుటుంబ సౌఖ్యము కలుగును. సమాజంలో కీర్తి కలుగును. అనుకున్న ప్రతీ పని పూర్తి చేసేదరు. చతుర్థస్థానము నందు బుధులు అనుకూలించును. పంచమ ఆరవ స్థానమునందు శని, శుక్రుల ప్రభావంచేత మీరు అనుకున్న ప్రతీ పని అనుకున్న విధముగా పూర్తి చేసెదరు. ధన సంబంధించిన విషయాలు అనుకూలించును. ఈ రోజు ఒత్తిళ్ళు తగ్గును. శని, గురు గ్రహాల అనుకూల ప్రభావం చేత చేసే ప్రతీ పనిలో విజయం పొందెదరు. ప్రయాణములు, దైవదర్శనములు అనుకూలించును. స్త్రీ సౌఖ్యం కలుగును. ఆరోగ్య విషయాల్లో , కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించడం మంచిది. కన్యారాశి వారు మరింత శుభఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణం చేయడం మంచిది.
💃💃💃💃💃💃💃

⚖ తుల
ఈరోజు (17-02-2023)

తులారాశి వారికి ఈ రోజు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. పంచమంలో శని శుక్రుల అనుకూల ప్రభావంచేత తులారాశివారు చేసే పనుల యందు అనుకూలమైన ఫలితాలు పొందెదరు. శత్రు స్థానములో గురుడు, ఆయు స్థానములో కుజుని ప్రభావంచేత తులారాశి వారికి శత్రు వర్గము వలన ఇబ్బందుల, కుటుంబము నందు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టును. మిగతా గ్రహాల అనుకూల స్థితి వలన తులారాశివారు అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేసెదరు. జన్మరాశి యందు కేతువు, సప్తమ స్థానము నందు రాహువు ప్రభావంచేత చికాకులు, ఒత్తిళ్ళు ఏర్పడును. వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితములు కలుగును. విద్యార్థులకు మధ్యస్థ ఫలములు, స్త్రీలకు కుటుంబమునందు సౌఖ్యము. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలెను. తులారాశివారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లలితా సహస్రనామాన్ని ఈ రోజు ఆవునేతితో దీపాన్ని వెలిగించి పఠించడం మంచిది.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం
ఈరోజు (17-02-2023)

వృశ్చికరాశికి ఈ రోజు మధ్యస్థముగా ఉన్నది. అర్ధాష్టమ శని ప్రభావంచేత కళత్ర స్థానములో కుజుని ప్రభావంచ చేత కుటుంబ సమస్యలు, పని ఒత్తిళ్ళు అధికముగా ఉండును. వృశ్చికరాశివారు ఆరోగ్య విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. వివాదములకు దూరంగా ఉండాలని సూచన. ద్వితీయ స్థానమునందు బుధుడు, తృతీయమునందు రవి సంచారము వలన ధన లాభము కలుగును. పంచమ స్థానమునందు గురుని ప్రభావంచేత ముఖ్యమైన పనులు విజయవంతముగా పూర్తి చేసెదరు. ఉద్యోగస్తులకు పనియందు ఒత్తిళ్ళు ఉ న్నప్పటికి అనుకున్న పని పూర్తి చేసెదరు. స్త్రీలకు నూతన వస్తు ప్రాప్తి కలుగును. వ్యాపారస్తులకు మధ్యస్త ఫలితాలు ఉన్నాయి. వృశ్చిక రాశివారు మరింత శుభఫలితాలు పొందడం కోసం కృష్ణాష్టకం పఠించడం మంచిది.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు
ఈరోజు (17-02-2023)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలముగా ఉన్నది. ప్రయాణములు అనుకూలించును. జన్మరాశి యందు బుధుని సంచారముచేత వ్యాపారస్తలకు లాభములు, ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు అనుకూలత కలుగును. ధనూరాశి వారికి కుజ , గురు గ్రహాల అనుకూల స్థితి వలన చేసే పనులయందు విజయము పొందెదరు. ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి వారం. వ్యాపారస్తులకు మధ్యస్త సమయము. ధనూరాశి వారికి ఈవారం ధనలాభము సౌఖ్యము కలుగు సూచన. ధనూరాశివారు మరింత శుభఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం
ఈరోజు (17-02-2023)

మకర రాశి వారికి ఈ రోజు అనుకూలముగా లేదు. జన్మరాశి యందు రవి సంచారము చేత అనారోగ్య సమస్యలు అధికముగా మానసిక ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ద్వితీయ స్థానమునందు శని శుక్రుల ప్రభావంచేత (ఏలినాటి శని ప్రభావంచేత) ఖర్చులు అధికమగును. మకరరాశి వారు గొడవలకు దూరంగా ఉండాలని సూచన. వ్యయస్థానమునందు బుధుని ప్రభావం ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. ఆరోగ్య విషయములందు జాగ్రత్తలు వహించాలి. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. నాలగవ ఇంట రాహువు సంచారము వలన కొంత చికాకులు ఏర్పడును. ఉద్యోగస్తులకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు చెడు సమయము. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మకరరాశి వారు విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది. మకర రాశివారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని పూజించడం అలాగే ఆవునేతితో దీపారాధన చేయడం మంచిది.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం
ఈరోజు (17-02-2023)

కుంభ రాశి వారికి ఈ రోజు చెడు ఫలితాలున్నాయి అధికముగా ఉన్నాయి. జన్మరాశి యందు శని, వ్యయస్థానమునందు రవి, చతుర్థ స్థానమునందు కుజుని ప్రభావం చేత ధనపరమైన సమస్యలు, మానసిక ఒత్తిళ్ళు, వేదనలు అధికముగా ఉండును. కుంభరాశి వారు ఆర్ధిక పరమైనటువంటి విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్ధిక సమస్యలు ఏర్పడు సూచన. ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు సమస్యలు అధికముగా ఉండును. వ్యాపారస్తులకు అప్పు పుట్టును. ద్వితీయ స్థానమునందు గురుని వలన కుంభరాశివారికి కుటుంబ వ్యవహారాలు యందు మధ్యస్థ ఫలితాలు కలుగును. ఆర్ధిక సమస్యలు ఉన్నప్పటికి ఏదో రకంగా ముందుకు సాగెదరు. ఏలినాటి శని వలన చేసే ప్రతీ పనియందు కొంత ఆటంకములు ఏర్పడు సూచన. ఈరోజు విద్యార్థులకు మధ్యస్థ ఫలితాలున్నాయి. కుంభరాశి వారు ఈ రోజు మరింత శు భ ఫలితాలు పొందడం కోసం లలితా సహస్ర నామాన్ని పారాయణం చేయడం మంచిది
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం
ఈరోజు (17-02-2023)

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలముగా లేదు. ఏలినాటి శని ప్రభావం మీనరాశి వారికి అధికముగా ఉన్నది. జన్మరాశి యందు గురుడు, ఏలినాటి శని ప్రభావం చేత మీనరాశివారికి అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ధనపరమైనటువంటి వ్యవహారాలయందు జాగ్రత్తలు పాటించాలి. దశమంలో రవి ప్రభావంచేత మీనరాశి ఉద్యోగస్తులకు ఉద్యోగములో మధ్యస్థ ఫలితములు కలుగును. ఏలినాటి శని ప్రభావం చేత ఉద్యోగమునందు రాజకీయ ఒత్తిళ్ళు అధికమగును. జన్మరాశి యందు గురుని ప్రభావం వలన ఆరోగ్య విషయములయందు జాగ్రత్తలు వహించాలి. మానసిక ఒత్తిళ్ళకు దూరంగా ఉండాలని సూచన. మీనరాశి వారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఆవునేతితో దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవిని ఆరాధించవలన శుభ ఫలితము కలుగును.
🦈🦈🦈🦈🦈🦈🦈