Fashion

చెలి జోరు… పులిగోరు..

చెలి జోరు… పులిగోరు..

సింహం జూలుతో జడలేసి, పెద్దపులిని కార్టూన్‌ బొమ్మగా చిత్రించి కామెడీ రీల్స్‌ చేస్తున్న రోజులివి. అలాంటిది పులిగోరు పురుష పుంగవులదే అంటే ఆమె ఒప్పుకొంటుందా? మాకూ ఆ రాజసం కావాల్సిందే, రాజావారి నగలకే కాదు, రాణీవారి సొమ్ములకూ పులిగోరు హోదా దక్కాల్సిందే.. అని పట్టుబట్టింది బుట్టబొమ్మ. ఇంకేముంది, వ్యాఘ్ర నఖాలు పడతి పాదాక్రాంతం అయ్యాయి. పులిగోరు నగలు ఆడపిల్ల ఆస్తిగా మారిపోయాయి.

పులిగోరుతో మన పరిచయం ఇప్పటిది కాదు. వందల ఏండ్ల నుంచీ నగల తయారీలో భాగమైంది. నిజానికి, ధీరత్వానికి గుర్తుగా ఒకప్పుడు రాజ కుటుంబీకులు, జమీందార్లు దీన్ని ధరించేవారు. కానీ తనవికాని నగలు ఉన్నాయంటే మగువ మనసు తల్లడిల్లకుండా ఉంటుందా? వాటిని సొంతం చేసుకునే దాకా సాంత్వన పొందుతుందా? అందుకే ఆభరణాల తయారీ దారులు తమ పంథా మార్చుకున్నారు. పులిగోరు చుట్టూ నగిషీలు అల్లారు. రాళ్లను పొదిగారు. పూసల దండలు గుచ్చారు. ముద్దుగా ముస్తాబు చేసి మగువ ముచ్చట తీర్చారు. ఇంకేం ఇప్పుడు పెండెంట్లు, నెక్లెస్‌లు, గొలుసులు, హారాలుగానూ వస్తున్నాయి అతివల పులిగోరు నగలు. ఫ్యాషనబుల్‌గా కంటెల్లోనూ వీటిని అలంకరిస్తున్నారు. ముత్యాల హారాలు, నల్లపూసలు, కెంపు దండల్లో లాకెట్లుగా సైతం మెరుస్తున్నాయి. బంగారంతో పాటు ఇమిటేషన్‌ రకాల్లోనూ తయారవుతూ.. రాణెమ్మ మెడకు రాజసాన్ని తెచ్చిపెడుతున్నాయి.