Health

దేశంలో పెరిగిన కరోనా కేసులు..

దేశంలో పెరిగిన కరోనా కేసులు..

దేశంలో కరోనా కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. కొన్నాళ్ల వరకు 1000కి లోపే ఉన్న కేసుల సంఖ్య ప్రస్తుతం వెయ్యిని దాటి నమోదు అవుతున్నాయి..

తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం దేశంలో 1,134 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7,026కు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో చత్తీస్ గఢ్, ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కరు చొప్పున ఐదుగురు మరణించారు..