Politics

నేను ఎవరికి ఓటు వేశా నో.. వాళ్లకు ఎలా తెలుసు. శ్రీదేవి

నేను ఎవరికి ఓటు వేశా నో.. వాళ్లకు ఎలా తెలుసు. శ్రీదేవి

నేను ఓటేశానా? ఎవరికి వేశాను? అనేది తెలియకుండానే చిలవలు పలవలుగా కథనాలు రాసారు

నేను ఓట్ చేస్తున్నప్పుడు వారెమైనా సీక్రెట్‌గా టేబుల్ కింద ఎవరైనా కూర్చొన్నారా? శ్రీదేవిని తొలగించాలని పక్కాగా ప్లాన్ చేసి ఎమ్మెల్సీ ఎలక్షన్ సాక్షిగా.. కుట్ర చేశారు. నా భర్త, నేనూ ఇద్దరం డాక్టర్స్. మంచి క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి నన్ను కంటెస్ట్ చేయమని అడగ్గానే ప్రజలకు సేవ చేద్దామని భ్రమపడి వెళ్లాను. ఒక రాజ్యాంగంలో ఎమ్మెల్యే పదవి 5 ఏళ్లు ఉంటుంది. కానీ ఏపీలో ఏ రాజ్యాంగం అమల్లో ఉందో తెలియదు. ఎలక్షన్ సమయంలో గడపగడపకు వెళ్లినప్పుడు ప్రతి ఒక్కరూ నన్ను అడిగారు.. ‘అమరావతి ఇక్కడే ఉంటుందా?’ అని. మా జగనన్న తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారని.. ఇక అమరావతి రాజధాని కాకుండా ఎక్కడికి పోతుందని ధైర్యం చెప్పా. కానీ కొంతకాలంగా వారు రాజధాని కోసం ఇబ్బంది పడుతుంటే ఏం చేయలేకపోయేదాన్ని. అమరావతిలో జరిగిన అభివృద్ధి రాష్ట్రంలో ఎక్కడైనా ఏమైనా చేశారా? అభివృద్ధి పేరుతో వేల కోట్లు నొక్కేశారు. నాకు ఏపీకి రావాలంటే భయమేస్తోంది. ఎందుకంటే ఎస్సీలపై జరుగుతున్న దాడులు. ఎమ్మెల్యేగానే నేను భయపడుతుంటే.. సామాన్యులు తిరగగలరా?’’ అని శ్రీదేవి ప్రశ్నించారు.