NRI-NRT

దుబాయిలో వైయస్ జగన్ కు క్షీరాభిషేకం

దుబాయిలో వైయస్ జగన్ కు క్షీరాభిషేకం

పొట్ట కూటి కొరకు కన్న వారికి, కట్టుకోన్న వారికి దూరంగా వెళ్ళె వారిలో అత్యధికులు పేదలు కాబట్టి అందునా సహాజంగా దళితులు ఉంటారు. వివిధ కారణాల వలన దళితులు బైబిల్ మార్గాన్ని ఎంచుకోని క్రైస్తవ ధర్మాన్ని స్వీకరిస్తున్నారు, ఈ రకంగా దళిత క్రైస్తవం ఆంధ్రప్రదేశ్ లో బలీయంగా ఉండగా వారిలో ఎక్కువ మంది గల్ఫ్ దేశాలలో పొట్ట కూటి కొరకు వస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించె విధంగా శాసన సభలో తీర్మానం ప్రవేశపెట్టడాన్ని గల్ఫ్ దేశాలలోని దళిత క్రైస్తవ సంఘాలన్ని హర్షించాయి. ఈ మెరకు ఇటీవల దుబాయి నగరంలో యు.ఏ.ఇలోని ప్రవాసాంధ్ర దళిత క్రైస్తవులు వై.యస్. జగన్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు వ్యక్తం చేసారు. దుబాయిలోని వెస్ట్ జోన్ సూపర్ మార్కేట్ ప్రాంతంలోని పార్కులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యుఏఇ లోని ప్రవాసాంధ్ర దళిత సంఘాల నాయకులు తరపట్ల మోహన్,పాలపర్తి నీలిమ,కాగిత కుమార్,గోసంగి లక్ష్మి, కొల్లే రవి కుమార్,నక్క ఎలిజిబెత్,ఓగురి శ్రీనివాస్,ఈద శరత్ బాబు,మారుమూడి సుధ, నాగమణి, సాగర్,అనిల్ మోక, మురళి నల్లి,రామరాజు గొడి,తాడి రమేష్, సునీల్ ఖన్నా,నక్క శ్రీనుకుమార్, పండు, తదితరులు పాల్గొన్నారు. దీనిపై యూఏఈ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ ప్రసన్న సోమిరెడ్డి స్పందిస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాయకత్వములో రాష్ట్రములోని అన్ని వర్గాలకు,ప్రాంతాలకు సమాన అవకాశాలు ,సమ న్యాయము చేస్తూ సమగ్ర అభివృద్ధి కి కృషి చేస్తుండగా దానికి గల్ఫ్ దేశాలలోని ప్రవాసీయులు కూడ మద్దతు తెలుపుతున్నారని పెర్కోన్నారు.