DailyDose

TNI నేటి తాజా వార్తలు. సీఎం పర్యటనలో బాలినేనికి అవమానం

TNI నేటి తాజా వార్తలు. సీఎం పర్యటనలో బాలినేనికి అవమానం

*ప్రకాశం. .సీఎం పర్యటన లో మాజీ మంత్రి బాలినేని కి అవమానం…కార్ ని అడ్డుకున్న పోలీసులు… పోలీసు లపై ఆగ్రహం…. వెనక్కి వెళ్లిన బాలినేని… ఎస్పీ.. మార్కుపురం ఎమ్మెల్యే చెప్పిన వినకుండా వెళ్లిపోయిన మాజీ మంత్రి

*ప్రభుత్వ రంగ సంస్థల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వైఖరితో మాకు సంబంధం లేదు. మాకు మాత్రం ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడటమే ముఖ్యం. ఏపీ ప్రభుత్వ స్పందనతో మాకు సంబంధం లేదు. ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పోరాడాలన్నది కేసీఆర్‌ విధానపరమైన నిర్ణయమని కేటీఆర్ స్పష్టం చేశారు.

*కాంగ్రెస్ ను వీడనున్న మహేశ్వర్ రెడ్డి?

సాయంత్రం ఢిల్లీకి ఏలేటి

బీజేపీ లో చేరే అవకాశం?

గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరం

ఉత్తమ్ మనిషిగా ఏలేటి కి పేరు

నిన్న ఉత్తమ్ బుజ్జగించినా మెత్త బడని ఏలేటి

సాయంత్రం పార్టీ మార్పు నిర్ణయం పై ప్రకటన చేసే అవకాశం

*SupremeCourt update:

Our case on R-5 Zone Amaravati in supreme court listed for tomorrow on
13th April 2023.

*BIG BREAKING: BRS మీటింగ్ లో విషాదం

TS: ఖమ్మం జిల్లా కారేపల్లి మం. చీమలపాడులో విషాదం జరిగింది. BRS ఆత్మీయ సమ్మేళనం కోసం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములు వస్తుండటంతో కార్యకర్తలు బాణసంచా పేల్చారు. నిప్పురవ్వలు పడి పూరి గుడిసె దగ్ధమైంది. మంటల వల్ల గుడిసెలోని సిలిండర్ పేలి ఒకరు మృతి చెందగా, మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.

*ఏపీ వాసులకు అలెర్ట్.. ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు.. 4రోజులు జాగ్రత్తగా ఉండాలి అంటున్న వాతావరణ శాఖ..
ఎండలు మండిపోతున్నాయి.. భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశముందని ప్రకటించింది. ప్రజలకు బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఆగ్నేయ నుంచి నైరుతి దిశలో గాలులు వీస్తుండటంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాలలో రాబోయే 3 రోజుల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటిగ్రేడ్ అధికంగా నమోదవుతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. వడగాల్పులు వీచే ప్రమాదముందని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది.

ఐఎండి అంచనాల ప్రకారం ఈరోజు 4 మండలాల్లో తీవ్ర వడగాల్పులు,126 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం అవకాశం ఉంది. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఎండ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.

వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు 126: అల్లూరి జిల్లా 9, అనకాపల్లి 14, తూర్పు గోదావరి 16, ఏలూరు 5, గుంటూరు 6, కాకినాడ 12, కోనసీమ 1, కృష్ణా 6, ఎన్టీఆర్ 14, పల్నాడు 3, మన్యం 11, శ్రీకాకుళం 7, విశాఖ 3, విజయనగరం 18, వైయస్సార్ 3 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది.

*12.4.2023
Vijayawada

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు బిజెపిలో చేరి మొట్టమొదటిసారి బిజెపి రాష్ట్ర కార్యాలయానికి విచేస్తున్న సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోమ వీర్రాజు గారు జాతీయ కార్యదర్శి సునీల్ థియోధర్ గారు, సత్య కుమార్ గారు , జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి గారు ,రాష్ట్ర కార్యదర్శి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పాతూరి నాగభూషణం గారు శాలువాతో సత్కరించి యు బ్లడ్ డైరీ ని బహూకరించినారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు