NRI-NRT

శక్తివంతమైన దేశంగా భారత్‌… కీర్తిస్తున్న ప్రపంచ మీడియాలు?

శక్తివంతమైన దేశంగా భారత్‌… కీర్తిస్తున్న ప్రపంచ మీడియాలు?

అవును, భారత్ దినదినాభివృద్ధి చెందుతూ వస్తోంది.మోడీ ప్రభుత్వం( Modi ) వచ్చిన తరువాత దేశంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పొచ్చు.ఒకప్పుడు ఇండియా అంటే పెద్దగా లెక్క చేయని అమెరికా వంటి దేశాలు ఇపుడు భారత్ స్నేహాన్ని మరింత కోరుకుంటున్నాయి.ఇక ప్రపంచ మీడియాలు కూడా మన దేశం కీర్తిని వెలుగెత్తి చాటే ప్రయత్నం చేస్తున్నాయి.

అవును, నేడు భారత్ అన్ని రంగాల్లో దూసుకుపోవడం మనం గమనించవచ్చు.ఈ తరుణంలో భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ( Minister Jai Shankar )ఆడిన మాటలు తెగ వైరల్ అవుతున్నాయి.

భారత్ చుట్టూ ఉన్న దేశాలు భారత్ పై ఎలాంటి చర్యలు చేపట్టినా, చూస్తూ ఊరుకునే పరిస్థితిలో లేమని భారత విదేశాంగ మంత్రి జై శంకర్ బాహాటంగానే హెచ్చరించారు.ఈ క్రమంలో పాకిస్థాన్, చైనా( Pakistan, China ) కి గట్టిగా తగిలాయి ఈ మాటలు.పాక్ అక్రమిత కాశ్మీర్ లో దాడులు చేసినా, చైనా తవాంగ్, అరుణ చల్ ప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో ఎలాంటి విధ్వంసం చేపట్టినా, తాము కూడా ఎదురు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన బహిరంగంగానే హెచ్చరించారు.ఆఫ్రికా దేశం ఉగాండాలో జరిగిన ఒక సమావేశంలో జై శంకర్ ఈ రకంగా మాట్లాడడం గమనార్హం.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని విషయాలు ప్రస్తావించడం కొసమెరుపు.2016లో ఉరి ఎటాక్ జరిగిన తర్వాత, పఠాన్ కోఠ్ లో జరిగిన మరో దాడి అనంతరం, పాకిస్థాన్ లోని సైనిక స్థావరాలను, ఉగ్రవాద ముఠా స్థావరాలను ఛిన్నాభిన్నం చేశామని చెప్పుకు రావడం కొసమెరుపు.ఇప్పుడు ఇతర దేశాలు కూడా తమ దేశంపై దాడులు చేస్తే చూస్తూ కూర్చొనే ప్రభుత్వం అధికారంలో లేదని దాడికి ప్రతి దాడి చేసి తీరుతామని హెచ్చరికలు జారీ చేశారు.దేశంపై ఎక్కడ ఎవరూ ఎటాక్ చేయాలని ప్రయత్నించినా వారికి అదే రీతిలో రెట్టింపు విధానంలో తగిన బుద్ధి చెబుతామన్నారు.