🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌿సాధారణంగా మన సాంప్రదాయాల ప్రకారం ఏదైనా పవిత్ర క్షేత్రాలకు, ప్రదేశాలను దర్శించినప్పుడు చెప్పులు బయటవదిలి వెళ్లడం పూర్వం నుంచి ఆచారంగా వస్తోంది.
🌸కేవలం గుడికి వెళ్ళినప్పుడు మాత్రమే కాకుండా మన ఇంట్లో కూడా చెప్పులు లేకుండా నడుస్తుంటాము. మన ఇంటిలో కూడా పూజ గది ఉండటం వల్ల దేవుని గది వద్దకు చెప్పులు వేసుకోకుండా గుమ్మం బయటే వదిలి రావడం ఆనవాయితీగా వస్తోంది.
🌿కానీ ఈ మధ్యకాలంలో కొన్ని అనారోగ్య సమస్యల వల్ల చాలామంది ఇంటిలో కూడా చెప్పులు వేసుకుని నడుస్తూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం.
🌸అయితే మన ఇంట్లో కూడా కొన్ని ప్రదేశాలలో చెప్పులు అసలు వేసుకోకూడదని పండితులు చెబుతున్నారు. అయితే ఆ ప్రదేశాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
🌿సాధారణంగా మనం ఇంట్లో దేవుడి గది ఉన్నచోటకు చెప్పులు వేసుకొని వెళ్ళము.అదేవిధంగా మన ఇంట్లో నిత్యవసర వస్తువులు భద్రపరిచి ఉన్న ప్రదేశానికి కూడా చెప్పులు వేసుకుని వెళ్ళకూడదు.
🌿బంగారం, డబ్బులు దాచి ఉంచే బీరువా, వంట గదిలో కూడా చెప్పులు వేసుకుని వెళ్ళకూడదు అని పండితులు చెబుతున్నారు.
🌸 సాధారణంగా మనం వంటగదిలో ఆహారం తయారు చేసుకుంటాము. సాక్షాత్తు అగ్నిదేవుడుగా భావిస్తాము కనక వంటగదిలో చెప్పులు వేసుకుని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళకూడదు.
🌿ఇక డబ్బులు, బంగారం దాచి పెట్టే చోటకి కూడా చెప్పులు వేసుకోకూడదు. ఎందుకంటే బంగారాన్ని సాక్షాత్తు ఆ లక్ష్మీదేవిగా భావిస్తారు కనుక ఆ ప్రదేశానికి వెళ్లేటప్పుడు చెప్పులు వేసుకోకూడదు.
🌸అదేవిధంగా పుణ్య నదులు అయినటువంటి గంగ,కృష్ణ ,గోదావరి నదులను సాక్షాత్తు దైవ సమానంగా భావిస్తారు. కాబట్టి అలాంటి నదులను సందర్శించేటప్పుడు, పుష్కరాల సమయంలో లేదా కుంభమేళా జరిగిన సమయంలో చెప్పులు ధరించి నదిలోకి దిగ కూడదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.
🌿అందుకే మన పూర్వీకులు ఎక్కువభాగం చెప్పులు లేకుండా నడవడం అలవాటు పడేవారు…స్వస్తీ…🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿