Devotional

నేటి మీ రాశి ఫలితాలు

నేటి మీ రాశి ఫలితాలు

🕉️హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
✍🏻 24.04.2023 ✍🏻
🗓 నేటి రాశి ఫలాలు 🗓

🐐 మేషం
ఈరోజు (24-04-2023)

ఈ రోజు చేపట్టిన వ్యవహారాలలో మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ద వహించాలి .ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. దూర ప్రయాణ సూచనలున్నవి. సోదరుల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. వృత్తి ఉద్యోగాలు సంతృప్తిగా సాగుతాయి. వ్యాపారాలలో తొందరపాటు పనిచేయదు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం
ఈరోజు (24-04-2023)

ఈ రోజు దీర్ఘకాలిక ఒత్తిడి పెరుగుతుంది వృధా ఖర్చులు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ పెద్దల ఆరోగ్యవిషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం
ఈరోజు (24-04-2023)

ఈ రోజు నూతన కార్యక్రమాలను ప్రారంభించి లాభాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కీలక విషయాల గురించి చర్చలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం
ఈరోజు (24-04-2023)

ఈ రోజు ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభాలను అందుకుంటాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి. శ్రమకు తగిన వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం
ఈరోజు (24-04-2023)

ఈ రోజు ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంతాల వారి నుండి అందిన సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. బంధు మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలు వేగవంతం చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో శుభవార్తలు అందుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య
ఈరోజు (24-04-2023)

ఈ రోజు అనుకోకుండా చేసిన ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. క్రయ విక్రయాలలో నూతన లాభాలు పొందుతారు. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా పనులను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగమున ఉన్నతి కలుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
💃💃💃💃💃💃💃

⚖ తుల
ఈరోజు (24-04-2023)

ఈ రోజు వృత్తి ఉద్యోగాలలో ఆశించిన స్థానాలు ఉంటాయి. వ్యాపారపరంగా ఎదురైనా అవరోధాలను అధిగమిస్తారు. సంతానం విద్యా విషయాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. దూర ప్రాంతాల నుండి మిత్రుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం
ఈరోజు (24-04-2023)

ఈ రోజు భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత పొందుతారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. సోదర వర్గం వారి నుండి ఊహించని ఆర్ధిక సహాయం అందుతుంది. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు
ఈరోజు (24-04-2023)

ఈ రోజు వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు పొందుతారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. విందు వినోద కార్యక్రమాలలో ఆహ్వానాలు అందుతాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి నుండి బయట పడతారు. వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం
ఈరోజు (24-04-2023)

ఈ రోజు ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలిగి హోదాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు శత్రువుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం
ఈరోజు (24-04-2023)

ఈ రోజు ప్రయాణాలలో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం
ఈరోజు (24-04-2023)

ఈ రోజు కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసి ప్రముఖుల నుండి ప్రశంసలు పొందారు. వృత్తి ఉద్యోగాలలో స్వంత ఆలోచనలను ఆచరణలో పెడతారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
🦈🦈🦈🦈🦈🦈🦈