Editorials

శంఖం లక్ష్మీ కటాక్షము

శంఖం  లక్ష్మీ కటాక్షము

మంగళకరమైన వస్తువులలో శంఖం ఒకటిగా పెద్దలు పేర్కొంటారు.  శంఖ నాదం శుభకరం.
విజయానికి చిహ్నంగా వినిపించే శంఖనాదాన్ని  “విజయ శంఖం” అంటారు.

మహావిష్ణువు శంఖానికి ‘ పాంచజన్యము’ అని పేరు.అర్జునుని శంఖానికి దేవదత్తం అనే పేరు.  వినాయకుడు శంఖాసురుని సంహరించి మోక్షం యిచ్చాక అతని నివాసమైన
శంఖాన్ని విజయశంఖంగా పొందాడని పురాణ కధ.

పరమేశ్వరునికి చేసే అభిషేకాలలో శంఖాభిషేకం విశేషమైనది.
కార్తిక మాసంలో సోమవారములనాడు
శివాలయాలన్నింటిలో శంఖాభిషేకాలు జరుగుతాయి.

వైష్ణవాలయాలలో శంఖు ధార, చక్రధార, అనే పేర్లతో అభిషేకాలు జరుగుతాయి.
వివాహాది శుభకార్యాలలో
శంఖునాదం శుభంగా పరిగణిస్తారు.
“మృదంగ,తాళాది మంగళవాద్యాల నడుమ శంఖునాదాలు
మార్మోగగా”  అని అండాళ్ స్తుతులలో వున్నది.

లక్ష్మీదేవి వలెనే శంఖం కూడా సాగరగర్భాన్నే ఆవిర్భవించి
నందువలన శంఖాన్ని లక్ష్మీ కటాక్షము గా భావిస్తారు.

పరమ పవిత్రమైన దక్షిణావర్త శంఖంలో ధాన్యం నింపి పూజించడవలన గృహంలో  ఐశ్వర్యాభివృధ్ధి కలుగుతుందనే ధృఢవిశ్వాసం ప్రజలలో ఉన్నది.