NRI-NRT

తెలంగాణాలో ద్వితీయ శ్రేణి నగరాల్లో పెట్టుబడులు పెట్టండి ..

తెలంగాణాలో ద్వితీయ శ్రేణి నగరాల్లో పెట్టుబడులు పెట్టండి ..

గ్లోబల్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల
ఐటీ సర్వ్ అలయన్స్ సభ్యుల విశేష స్పందన!!

అమెరికాలోని న్యూ జెర్సీ లో ఐటీ సర్వ్ అలయన్స్ సమావేశం జరిగింది, ముఖ్య అతిధిగా అమెరికా సెనెటర్ (న్యూ జెర్సీ ) కోరి బుకర్ పాల్గొన్నారు , ఈ కార్యక్రమానికి హాజరైన మహేష్ బిగాల మాట్లాడుతూ కెసిఆర్ గారి అద్వ్యర్యములో అన్ని రంగాలలో తెలంగాణ ఎంతో ముందుకు దూసుకెళ్తుంది సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో దేశంలోనే అత్యంత విజయవంతమైన స్టార్టప్‌గా తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు. అలాగే కేటీర్ గారు ఐటీ రంగములో అంతర్జాతీయ సంస్థలను తెలంగాణ తీసుకు వచ్చారు , ఐటీ రంగములో దేశములో తెలంగాణ ముందింది. రాష్ట్రంలో విద్యుత్‌ లోటు, నీటికొరత వంటి స‌మ‌స్య‌ల‌ను అధిగమించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు ,టైర్ 2 నగరాల్లో ఐటీని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ప్లగ్ & ప్లే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్మించడం వంటి టైర్ 2 నగరాల్లో ఐటీని ప్రోత్సహించేందుకు తీసుకున్న చర్యలను ఆయన వివరించారు.హైదరాబాద్ కాకుండా టైర్ ౨ నగరాల్లో ఇప్పటికే ఇట్ హబ్ ప్రారంభం అయ్యాయి , తెలంగాణలోని టైర్ 2 నగరాల్లో పెట్టుబడి అవకాశాలను వివరించారు .మిగితా టైర్ 2 నగరాలలో విస్తృతం చేసే భాగంగా రాబోయే రోజుల్లో నిజామాబాదు , మహాబూబ్నగర్ ,సిద్దిపేట మరియు నల్గొండ లో త్వరలో కేటీర్ గారు ప్రారంభించనున్నారు అని తెలిపారు. తెలంగాణ ప్రోత్సహకాలలో భాగంగా మొదటి సంవత్సరం రెంటల్ ఫ్రీ గ ఇస్తున్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమములో నార్త్ ఈస్ట్ కి సంబంధించిన 250 మంది వివిధ కంపెనీల యజమానులు పాల్గొన్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమములో ఐటీ సర్వ్ నేషనల్ ప్రెసిడెంట్ విజయ్ మహాజన్ అలాగే నార్త్ ఈస్ట్ ప్రెసిడెంట్ కళ్యాణ్ అద్వ్యర్యములో పెద్ద ఎత్తున జరిగింది, ఇందులో ప్రవీణ్ తడ్కమల్ల, ప్రవీణ్ ఎండపల్లి , మహీందర్ ముసుకు వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. అందరూ టైర్ 2 నగరాల్లో పెట్టుబడి పెట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేసారు. తెలంగాణ ఇస్తున్న ప్రోత్సహకాలపై సంతోషం వ్యక్తం చేసారు