Business

స్వల్ప నష్టాల్లో మార్కెట్ సూచీలు..!

స్వల్ప నష్టాల్లో మార్కెట్ సూచీలు..!

దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. తొలుత లాభాల్లో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత వెంటనే నష్టాల్లోకి జారుకొన్నాయి.

ఇంటర్నెట్ డెస్క్ : దేశీయ మార్కెట్ (Stock Market) సూచీలు నేడు లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించి.. ఆ తర్వాత కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకొన్నాయి. ఉదయం 9.25 సమయంలో సెన్సెక్స్ (BSE) 73 పాయింట్ల నష్టంతో 60,575 వద్ద ఉండగా.. నిఫ్టీ(NSE) 8 పాయింట్ల నష్టంతో 17,906 వద్ద ట్రేడవుతున్నాయి. బెంగాల్ అండ్ అస్సాం కంపెనీ లిమిటెడ్, పీఐ ఇండస్ట్రీస్, గ్లెన్ మార్క్ లైఫ్ సైన్సెస్, తేజస్ నెట్వర్క్, ఈకేఐ ఎనర్జీ లాభాల్లో ఉండగా.. మిర్జా ఇంటర్నేషనల్, శ్రీరామ్ ఫైనాన్స్, బ్రెట్కామ్ గ్రూప్, ట్రెంట్, మోతీలాల్ ఓస్వాల్ షేర్ల ధరలు కుంగాయి.

నిన్నటి ట్రేడింగ్లో అమెరికా మార్కెట్లు సానుకూలంగా ముగిశాయి. ముఖ్యంగా నాస్ డాక్ సూచీ భారీ ర్యాలీ చేసింది. నిన్న ఏకంగా 2.43శాతం ఈ సూచీ విలువ పెరిగింది. డోజోన్స్ కూడా 1.57శాతం పెరిగింది. ఎండ్పీ 500 సూచీ 1.96 శాతం ఎగసింది. ఈ ప్రభావం ఆసియా మార్కెట్లపై కూడా కనిపిస్తోంది. జపాన్, కొరియా, హాంకాంగ్ మార్కెట్ సూచీలు 0.5శాతం నుంచి 1శాతం వరకు ర్యాలీచేశాయి.

ఐటీ దిగ్గజం విప్రో 2022-23 మార్చి త్రైమాసికంలో రూ.3074.5 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2021- 22 ఇదే కాల లాభం రూ.3087.3 కోట్లతో పోలిస్తే ఇది 0.4%తక్కువ 0. రూ.12,000 కోట్లతో షేర్లను తిరిగి కొనుగోలు (బైబ్యాక్) చేస్తామని కంపెనీ ప్రకటించింది. 26.96 కోట్ల షేర్లను ఒక్కోటీ రూ.445 వద్ద తిరిగి కొనుగోలు చేయడానికి విప్రో బోర్డు ఆమోదముద్ర వేసింది. కంపెనీ పెయిడప్ షేర్లలో 4.91 శాతం వాటాకు ఇవి సమానం. రూ.12,000 కోట్లకు మించకుండా ఈ బైబ్యాక్ చేపట్టనున్నట్లు ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో కంపెనీ పేర్కొంది.

మార్చి త్రైమాసికంలో టెక్ మహీంద్రా ఏకీకృత నికర లాభం 34.69% తగ్గి రూ.1,117.8 కోట్లకు పరిమితమైంది. లాభాల మార్జిన్లు తగ్గడం ఇందుకు నేపథ్యం. ఇదే సమయంలో మొత్తం ఆదాయం 13 శాతం పెరిగి రూ.13,718 కోట్లకు చేరింది. మొత్తం కాంట్రాక్టు విలువ 1.011 బిలియన్ డాలర్ల నుంచి సగానికి తగ్గి 592 మిలియన్ డాలర్లకు పరిమితమైంది.

*విద్యుత్తు వాహనాల బ్యాటరీ స్వాపింగ్ సేవల సంస్థ రేస్ ఎనర్జీ, తమ బ్యాటరీలకు ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్(ఏఐఎస్) 156 ఫేజ్ 2 సర్టిఫికేషన్ పొందినట్లు తెలిపింది.

ఎటువంటి ఇబ్బందీ లేకుండా భారతీయ వినియోగదార్లు అంతర్జాతీయంగా ఇ-కామర్స్ చెల్లింపులు చేసేందుకు ఒక ప్లాట్ఫాం రాబోతోంది. ఇందుకోసం డిజిటల్ చెల్లింపుల మౌలిక వసతుల సంస్థ పీపీఆర్ తో ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ (ఎస్ఐపీఎల్) ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం రూపే కార్డు వినియోగాన్ని విస్తృతం చేయడంతో పాటు పీపీఆర్డీకున్న అంతర్జాతీయ క్లయింట్లందరి దగ్గరా యూపీఐ చెల్లింపులను అనుమతించేలా చేస్తుంది. చెల్లింపు సేవల ప్రొవైడర్లు (పీఎస్పీలు), అంతర్జాతీయ మర్చంట్ అక్వైరర్స్.. పీపీఆర్డీకు క్లయింట్లుగా ఉన్నారు. తాజా పరిణామం వల్ల విదేశీ మార్కెట్లలోకి ఎస్ఐపీఎల్ మరింత విస్తరించేందుకు వీలవుతుంది.

కొత్తగా ప్రతిపాదించిన హరిత ఇంధన ప్రాజెక్టుల కోసం ||అదానీ గ్రూప్ 1-1.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.8,200-12,300 కోట్ల) సమీకరణ యత్నాల్లో ఉన్నట్లు ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాలు వెల్లడించాయి. జనవరిలో అమెరికాకు చెందిన షార్ట్సిల్లర్ సంస్థ హిండెన్బర్గ్, అదానీ గ్రూప్పై విడుదల చేసిన పరిశోధనా నివేదిక తర్వాత.. ఈ గ్రూప్ తీసుకోబోతున్న అతి పెద్ద రుణం ఇదే కానుంది.

ఆన్లైన్ గేమ్లను నైపుణ్యం, అవకాశం అని రెండు రకాలుగా వర్గీకరించి వేర్వేరుగా జీఎస్టీ రేటు విధించే అంశాన్ని ఆర్థిక శాఖ పరిశీలిస్తున్నట్లు జీఎస్జీటీ అధికారి ఒకరు తెలిపారు. ఇతర ఫలితంపై గెలుపు ఆధారపడే ఆన్లైన్ గేమ్లకు లేదా బెట్టింగ్, గ్యాంబ్లింగ్ రూపంలో ఉండే వాటికి 28 శాతం, నైపుణ్యంపై ఆధారపడే వాటికి 18 శాతం జీఎస్ఓ విధించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై తుది నిర్ణయాన్ని మే లేదా జూన్లో జరిగే జీఎస్టీ మండలి తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఆకర్షణీయ త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ షేరు 8.16% పరుగులు తీసి రూ. 3,729.35 వద్ద ముగిసింది.

నిరుత్సాహకర ఫలితాల నేపథ్యంలో వోల్టాస్ షేరు 5.41% కుదేలై రూ.808.80 దగ్గర స్థిరపడింది. లారన్ల్యాబ్స్ 2.6% తగ్గి రూ.292.25 వద్ద స్థిరపడింది.

* మార్చి త్రైమాసికంలో లాభం 31% పెరగడంతో బజాజ్ ఫిన్ సర్వ్ షేరు 1.90% పెరిగి రూ.1,359, 95 వద్ద ముగిసింది.

రేమండ్ కన్జూమర్ కేర్క చెందిన 3 బ్రాండ్లు- కామసూత్ర కండోమ్స్, పార్క్ అవెన్యూ పర్ఫ్యూమ్స్, కేఎస్ డియోడరెంట్స్ను గోద్రేజ్ గ్రూప్ రూ.2,825 కోట్లకు కొనుగోలు చేయనుంది. స్లంప్ సేల్ పద్ధతిలో ఈ లావాదేవీ జరగనుందని రేమండ్ సీఎఫ్ఎ అమిత్ అగర్వాల్ తెలిపారు.

* రుణ వాయిదాలు చెల్లించేందుకు అవసరమైన నగదు నిల్వలు వేదాంతా గ్రూప్ చేతిలో ఉన్నాయని, వచ్చే 2-3 ఏళ్లలో నికర రుణరహిత సంస్థగా మారడమే లక్ష్యమని సంస్థ అధిపతి అనిల్ అగర్వాల్ వెల్లడించారు.