Devotional

ద్వారకా తిరుమల చిన్న వెంకన్న వైశాఖమాస బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ద్వారకా తిరుమల చిన్న వెంకన్న వైశాఖమాస బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ఏలూరు : నేటి నుంచి ద్వారకా తిరుమల చిన్న వెంకన్న వైశాఖమాస బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 7 న బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. నేడు స్వామి, అమ్మవార్లను పెళ్లి కొడుకు, పెళ్లి కూతుర్లుగా అలంకరించనున్నారు. రాత్రి 8 గంటలకు గజవాహనంపై స్వామివారి ఊరేగింపు జరగనుంది. వచ్చే నెల 4 న స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం జరగనుంది. 5 న స్వామి వారి రథోత్సవం జరగనుంది. బ్రహ్మోత్సవాల సమయంలో ఆలయంలో జరిగే నిత్యార్జిత కళ్యాణాలు, ఆర్జిత సేవలు రద్దు చేయనున్నట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు పేర్కొన్నారు.