DailyDose

TNI. నేటి నేర వార్తలు..

TNI. నేటి నేర వార్తలు..

* ఒక కన్నుని పొడిచిన మరో కన్నుని సిబిఐ అరెస్ట్ చేసే వేళ, ఆదిరెడ్డి కుటుంబాన్ని సిఐడి అదుపులోకి తీసుకోవడం జగన్ స్టైల్ డైవర్షన్ డ్రామా. ఫిర్యాదులు లేని కేసుల్లో బిసి టిడిపి నేతలైన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసులని అదుపులోకి తీసుకోవడం ఏ1 దొంగ పాలనలోనే సాధ్యం. వైసిపిలో చేరలేదనే అక్కసుతో బీసీ నేతలైన ఆదిరెడ్డి కుటుంబంపై కక్ష కట్టడం దారుణం. ఆదిరెడ్డి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది.

…నారా లోకేష్
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి

* రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త, మామగార్ల అరెస్ట్…!!

మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆయన కుమారుడు ఆదిరెడ్డి వాసులను చిట్‌ఫండ్ కేసులో అరెస్ట్ చేసిన ఏపి సిఐడి…

* ఎన్టీఆర్ జిల్లా

గంపలగూడెం మండలం అమ్మిరెడ్డిగూడెం, గంగదేవరపాడు గ్రామంలో నకిలీ పురుగు మందులు వాడటం ద్వారా తీవ్ర పంట నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు

సుమారు 100 నుండి 120 ఎకరాల్లో పంటను నష్టపోయామని మీడియాకి తెలిపిన రైతులు

అమ్మిరెడ్డిగూడెం గ్రామంలో ఉన్న జై హనుమాన్ ఫెస్టిసైడ్స్ &సీడ్స్ షాపులో కోరాజెన్ అనే మందు వాడటం వల్లనే మాకు తీవ్ర పంట నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు

అప్పటి వరకు బాగా ఉన్న వరి పొలాలు ఆ మందు వాడిన తర్వాత కుశించిపోయాయి

ప్రతి సంవత్సరం మా పొలాలు ఒక ఎకరానికి 50 నుండి 55 బస్తాలు వరకు దిగుమతి వస్తుంది.ఈ సంవత్సరం ఈ నకిలీ కోరాజెన్ మందు వాడటం వల్లనా ఒక ఎకరానికి 4 నుండి 5 బస్తాలు అవ్వటం కూడా కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు రైతులు

జై హనుమాన్ ఫెస్టిసైడ్స్&సీడ్స్ షాపులో వాడిన కోరాజైన్ మందు వల్లనే మా వరి పంట దెబ్బతిందని తెలిపిన రైతులు

వేరే దగ్గర మందులు తెచ్చుకొని వరి పంటకు వాడిన ఇతర రైతులకు సుమారుగా ఒక ఎకరానికి 50 బస్తాలుకు పైగా దిగుబడి వచ్చిందని, ఇక్కడ ఈ నకిలీ మందులు వాడి మేము తీవ్రంగా నష్టపోయామంటున్న రైతులు

ఒక రైతు ఆవేదన మరో విదంగా ఉంది మా ముగ్గురు అన్నదమ్ములకు ఒకే చోట 10 ఎకరాలు భూమి ఉంది వాళ్ళు వేరే చోట మందులు వాడి ఒక ఎకరానికి 50 బస్తాలుకు పైగా దిగుబడి వచ్చిందని తనకు ఈ నకిలీ మందు వాడటం వల్లనా కనీసం ఒక ఎకరానికి 3 బస్తాలు కూడా అయ్యేటట్లు లేదని ఆవేదన వ్యక్తం చేసాడు

ఒక మహిళ రైతు తనకున్న ఒక ఎకరం భూమిలో వరి పంట వేసుకొని కూలీ పనులకు వెళ్లి ఆ వచ్చిన డబ్బులతో వరి పంటకు పెట్టుబడి పెట్టి ఈ నకిలీ మందు వాడి తీవ్రంగా నష్టపోయానని,అగ్గిలో ఎంతో కష్టపడి పనులకు వెళ్లి ఆ వచ్చిన డబ్బులతో పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయానని కన్నీటిపర్వాంతమైనా మహిళా రైతు

చాలా మంది రైతులు కోత కూలీలు కూడా రావని పంటను కోయకుండా అలాగే వదిలేశారు

ఇలా మాకు పంట నష్టం జరిగిందని షాప్ యజమానిని రైతులు అడిగితే నేను మంచి మందులు ఇచ్చాను నాకు లైసెన్స్ ఉంది మీకు చేతనైనది చేసుకోండి అని అంటున్నాడు అని మీడియాకి తెలిపిన రైతులు

అధికారులకు ఫిర్యాదు చేసిన కూడా మీ పంటకు తెగులు వచ్చిందని అంటున్నారు,ఆ కోరాజెన్ మందు టెస్ట్ కి పంపాం రిపోర్ట్ వచ్చాక చెప్పుతాం అని అధికారులు చెపుతున్నారు

అమ్మిరెడ్డిగూడెం, గంగదేవరపాడు గ్రామంలో జై హనుమాన్ ఫెస్టిసైడ్స్&సీడ్స్ షాప్ లో మందులు వాడిన రైతులము మాత్రమే నష్టపోయాం మిగతా వారి పంటలు బాగానే దిగుబడి వచ్చింది. అధికారులు మాత్రం మా పంటకు తెగులు వచ్చింది అంటున్నారు మిగతా వారి పంటలకు తెగుళ్లు రాలేదా దీనిని బట్టే అర్ధం అవుతుంది అధికారులు చెప్పేది నిజమో,కాదో అని

నష్టపోయిన రైతులము అందరము ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే మా పంట నష్టానికి కారణం అయిన షాపు వారిపై కఠిన చర్యలు తీసుకొని,నష్టపోయిన రైతులకు పంట నష్టాన్ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం

* బ్రేకింగ్ న్యూస్💥

కొణిజర్ల మండలం తుమ్మలపల్లి లో అకాల వర్షాలకు జరిగిన పంట నష్టాన్ని పరిశీలించిన వైఎస్ షర్మిల
మీడియాతో మాట్లాడుతూ అస్వస్థతకు గురైన షర్మిల ..
పొలంలోనే కింద పడిపోయిన షర్మిల