Editorials

ఉడతా భక్తి అనగా నేమి…???

ఉడతా భక్తి అనగా నేమి…???

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿ఈరోజుల్లో ఎవరైనా ఏదైనా సహాయం చేస్తే, నాదేముంది, నాకున్నదాంట్లో, కొంత ఉడతా భక్తిగా చేసాను అంటారు…

🌸అసలు ఉడత భక్తి అనే పేరు ఎలా వచ్చింది???…

🌷ఉడుత శరీరంపై గల చారలు ఏర్పడిన కథ…!!!🌷

🌿శ్రీరాముల వారు వారధి నిర్మించడం మొదలు పెడతారు, వానర వీరులు అంతా తలా ఒక చేయి వేసి తమ వంతు సహాయం చేస్తున్నారు…

🌸ఇంతలో ఒక ఉడుత అక్కడికి వచ్చి తాను కూడా ఆ మహా కార్యంలో పాల్గొనాలని ప్రయత్నించింది…
అనుకున్నదే తడవుగా తానేమి చేయగలనో అని నిరుత్సాహ పడకుండా,

🌿తన శరీరాన్ని తడుపుకుని దానికి ఇసుక అంటించుకుని సేతువు ను కట్టేందుకు ఉపయోగించే రాళ్ళ మధ్య వేసే బంధానికి ఉపయోగ పడేలా తనకు వీలైనంత సాయం చేయడం ప్రారంభించింది…

🌸 అలా చాలా సేపు చేయసాగింది, అలసి పోయి, నీరస పడి, క్రింద పడిపోయిందట, ఇదంతా గమనించిన శ్రీరాముల వారు దాని మీద ప్రేమతో దాని శరీరాన్ని నిమిరారట…

🌿దానికే ఉడుత శరీరాన్ని గమనిస్తే శ్రీరాముని మూడు వ్రేళ్ళ చారలు ఉంటాయి…

🌸 ఇవి శ్రీ రాముల వారి కరస్పర్శతో ఏర్పడినవంటారు, ఇక్కడ ఉడుత భక్తితో చేసిన ఆ సాయాన్ని, ఉడుతా భక్తి సహాయం అంటారు…

🌿ఇంతమంది పై లేని దయ , ఈ ఒక్క ఉడతకే ఎందుకు దక్కింది???…
అంటే చేసే కొద్ది సాయమైనా మనస్ఫూర్తిగా చేయాలని ఇక్కడ ఉద్దేశ్యం…

🌸 ఇక్కడ ఉడత చేసింది అదే, ఎవరో నన్ను చూడాలి అని కానీ, నేను అందరి దృష్టిలో పడాలని కానీ, ఆలోచించలేదు,

🌿అంతమంది వానరులలో నేను ఎంత అని కూడా భావించలేదు, కేవలం నేను కూడా రామ కార్యంలో పాల్గొనాలి, రామ సేవ చేయాలి, అనే దివ్య సంకల్పంతో పనిలో దిగింది, అంతటి నిస్వార్థ సంకల్పం ఒక్కటే రాముడి అనుగ్రహం పొందడానికి అర్హత సంపాదించింది,

🌸ఆ మూడు చారల అర్థం కూడా ఒకటి ఉంది, ఇక మీదట … నీకు ఎండా, వాన, చలి అనే బాధ వుండదు అని ఆశీర్వదించారట…

🌿మనం కూడా … ఏదీ చేసినా , ఉడత లాగా నిస్వార్థంగా నిమగ్నమవుతే , భగవంతుని అనుగ్రహం పొందడానికి అర్హులమవుతాము…స్వస్తీ..🚩🌞🙏🌹🎻
     
 🙏 సమస్త లోకా సుఖినోభవంతు🙏

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿