Politics

రఘురామరాజు టార్చర్ పై ప్రభుత్వానికి షాక్

రఘురామరాజు  టార్చర్ పై ప్రభుత్వానికి షాక్

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ పై హైకోర్టు కీలక ఉత్తర్వులు

రఘురామకృష్ణం రాజును అదుపులోకి తీసుకున్న సమయంలో కాల్‌ డేటాను స్వాదీనం చేసుకొని భద్ర పరచాలని సీబీఐకు ఏపీ హైకోర్టు ఆదేశాలు

కాల్ డేటాను వెంటనే సేకరించాలని ఆదేశం

తన కస్టోడియల్ టార్చర్ పై సీబీఐ విచారణ జరపాలని ఏపీ హైకోర్టులో ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటీషన్

ఈరోజు విచారణకు వచ్చిన పిటీషన్

టెలికం నిబంధనల ప్రకారం రెండు సంవత్సరాలు మాత్రమే కాల్ డేటా ఉంచుతారని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చిన రఘురామకృష్ణం రాజు న్యాయవాది నౌమీన్

వెంటనే కాల్ డేటాను ప్రిజర్వ్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్దించిన న్యాయవాది నౌమీన్

సీబీఐ తరపున అడిషనల్ సోలిసిటర్ జనరల్ హరినాద్ వాదనలు

ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ సిఐడీ వద్ద ఉందని అందువల్ల కాల్ డేటాను సీఐడీ సేకరించాలని వాదించిన హరినాద్

పిటీషనర్ ఆరోపణలే సిఐడీ మీద అయితే… అదే సంస్థను కాల్ డేటా ఎలా సేకరించమంటారని ప్రశ్నించిన హైకోర్టు

ఈ కేసులో ఇంప్లీడ్ పిటీషన్ వేసిన సీఐడీ

కాల్ డేటా సేకరించమనడం చట్టవిరుద్దమని చెప్పిన సీఐడీ తరపు న్యాయవాది

సీఐడీ ఇంప్లీడ్ పిటీషన్ ను ఇంకా అనుమతించలేదని పేర్కొన్న హైకోర్టు

సీబీఐకు ఇవ్వాలా… లేదా అనేది కోర్టు ఇంకా నిర్ణయించలేదని, ఈ కేసులో కాల్ డేటా కీలకమని వాదించిన న్యాయవాది నౌమీన్

దీంతో వెంటనే కాల్ డేటాను సేకరించి భద్రపరచాలని సీబీఐని ఆదేశించిన హైకోర్టు

కేసు విచారణ ను వేసవి సెలవుల అనంతరానికి వాయిదా వేసిన హైకోర్టు
Ippudu dorikutaaru dongalu. Chalaa try chesaaru case raakundaa last two years. Kottina, kottinchina Police vaallani 10 years jail lo pettinchali.. #RRR 🌶️