Sports

సిరాజ్ ఇంట్లో ఆర్‌సీబీ జట్టు…

సిరాజ్ ఇంట్లో ఆర్‌సీబీ జట్టు…

రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ప్లేయ‌ర్స్ హైద‌రాబాద్‌లో సంద‌డి చేశారు. పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ కొంత ఇంటిని సంద‌ర్శించారు. మే 18న (గురువారం) స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌ల‌ప‌డ‌నుంది.

ఉప్ప‌ల్ వేదిక‌గా జ‌రుగ‌నున్న ఈ మ్యాచ్ కోసం రెండు రోజుల ముందుగానే బెంగ‌ళూరు ప్లేయ‌ర్స్ హైద‌రాబాద్ చేరుకున్నారు. మంగ‌ళ‌వారం ఉద‌యం ఆర్‌సీబీ ప్లేయ‌ర్స్ హైద‌రాబాద్‌లోని మ‌హ్మ‌ద్ సిరాజ్ ఇంటిలో సంద‌డి చేశారు.

ఇటీవ‌లే ఫిల్మ్ న‌గ‌ర్‌లో కొత్త ఇంటిని క‌ట్టుకున్నాడు సిరాజ్‌. త‌న‌ కొత్త ఇంటికి విరాట్ కోహ్లితో పాటు ఇత‌ర ఆర్‌సీబీ ప్లేయ‌ర్స్‌ను సిరాజ్ ఆహ్వానించిన‌ట్లు తెలిసింది. సిరాజ్ ఆహ్వానం మేర‌కు కోహ్లితో పాటు డుప్లెసిస్ అత‌డి ఇంటిని సంద‌ర్శించారు.

ఈ వీడియోలో కోహ్లి, డుప్లెసిస్‌తో పాటు కేదార్ జాద‌వ్‌, పార్నెల్‌తో పాటు కొంద‌రు ఆర్‌సీబీ ప్లేయ‌ర్స్ క‌నిపిస్తోన్నారు. సిరాజ్ ఇంటిని ఆర్‌సీబీ ప్లేయ‌ర్స్ సంద‌ర్శించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

కోహ్లికి సిరాజ్‌కు మ‌ధ్య చ‌క్క‌టిఅనుబంధం ఉంది. చాలా ఏళ్లుగా విరాట్‌తో పాటు సిరాజ్ కూడా బెంగ‌ళూరు టీమ్‌లోనే కొన‌సాగుతోన్నాడు. ఆ అనుబంధంతోనే సిరాజ్ ఇంటికి కోహ్లి వ‌చ్చిన‌ట్లు చెబుతోన్నారు. 2018 ఏడాది కూడా ఆర్‌సీబీ ప్లేయ‌ర్స్ కు త‌న ఇంట్లో పార్టీ ఇచ్చాడు సిరాజ్‌.