Agriculture

తేనెటీగ ఎంత తేనె చేస్తుంది?

తేనెటీగ ఎంత తేనె చేస్తుంది?

తేనెను ఇష్టపడనివారు ఎవరు ఉండరు.తేనె ఇందులో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. తేనెను ఇష్టపడనివారు ఎవరు ఉండరు. అందులోనూ స్వచ్ఛమైన తేనె దొరికింది అంటే చాలు లొట్టలేసుకుని మరి తింటూ ఉంటారు.తేనె ఎన్ని సంవత్సరాలు అయినా కూడా పాడవకుండా అలాగే ఉంటుంది. మరి అలాంటి దీని వెనుక తేనెటీగల జీవితకాల కృషి ఇమిడి ఉంది. తేనెటీగలు ఒక చెంచా తేనెను తయారు చేయడానికి కొన్ని వేల కిలోమీటర్లు ఎగర వలసి ఉంటుంది. అంతేకాకుండా జీవితకాలంలో ఒక తేనెటీగ ఒక చెంచా కూడా తయారు చేయలేదు.

ఇక తేనేటీగలన్నింటీలొ మొదటగా ఆడ తేనెటీగలు మాత్రమే తేనెను తయారుచేస్తాయి. ఆ సమయంలో తేనేటీగల గుంపులో ఉండే మగ తేనెటీగలు ఏ పని చేయవు. ఈ ఆడ తేనెటీగల గుంపు ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడే మగ తేనేటీగలు కూడా ఉంటాయి. ఇకపోతే తేనెటీగ జీవిత కాలంలో ఎంత తేనెను సేకరిస్తుంది అనే విషయానికి వస్తే.. తేనెటీగ తన జీవిత కాలంలో ఒక చెంచా తేనెను కూడా తయారు చేయలేదు. తేనెటీగ తన జీవిత కాలంలో ఒక టీ స్పూన్ లో 12 వ వంతు వరకు మాత్రమే తేనెను తయారు చేస్తుంది.

ఒక చెంచా తేనె కోసం పన్నెండు తేనెటీగలు జీవితాంతం కష్ట పడతాయి. ఒక చెంచా తేనెను తయారు చేయడానికి తేనెటీగలు చాలా కష్టపడాలి. ఇక తేనెటీగ జీవిత కాలం కేవలం 45 రోజులు మాత్రమే. ఇకపోతే ఒక కిలో తేనెను తయారు చేయడం కోసం తేనేటీగలు దాదాపుగా 40 లక్షల పువ్వుల రసాన్ని పీల్చుకొని, 90 వేల మైళ్ళు ప్రయాణించవలసి ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు.