ScienceAndTech

అమెజాన్ అధినేత చేతికి భారీ నాసా ప్రాజెక్ట్….

అమెజాన్ అధినేత చేతికి భారీ నాసా ప్రాజెక్ట్….

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ అధినేత నాసా కాంట్రాక్టును దక్కించుకున్నారు. 2000 సంవత్సరంలో ఏరోస్పేస్ కంపెనీ బ్లూ ఆరిజన్ అనే సంస్థను స్థాపించింది. అయితే తాజాగా నాసా ఆర్టెమిస్ వి ప్రాజెక్టులో భాగంగా బ్లూ ఆర్జిన్ సంస్థ ఆస్ట్రోనాట్స్ ను చంద్రుని మీదకు పంపే స్పేస్ క్రాఫ్ట్ ల తయారీ కాంట్రాక్టును సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని నాసా చీఫ్ అధికారికంగా ప్రకటించారు.

ఈ నిర్ణయంతో నాసా ప్రాజెక్టుపై బ్లూ ఆరిజన్ సంస్థ పని చేసే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే ఆర్టెమిస్ వి ప్రోగ్రాంలో భాగంగా ఎలాన్ కు మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ ఆస్ట్రోనాట్స్ లూనార్ సర్ఫేస్ లోకి అడుగుపెట్టేలా స్టార్ షిప్ స్పేస్ క్రాఫ్ట్ లను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. 2021 సంవత్సరంలో ఇదే స్టార్ షిప్ స్పేస్ క్రాఫ్ట్ సాయంతో లూనార్ సర్ఫేస్ లోకి ఆస్ట్రోనాట్స్ విజయవంతంగా అడుగుపెట్టారు.ఇక తాజాగా జెఫ్‌ బెజోస్‌ సంస్థ బ్లూ ఆరిజన్‌ నాసా నుంచి దక్కించుకున్న కాంట్రాక్ట్‌ విలువ అక్షరాల 3.4 బిలియన్‌ డాలర్లు అంటే మన దేశ కరెన్సీలో రూ.28,150 కోట్లని నాసా ఎక్స్‌ప్లోరేషన్‌ చీఫ్‌ జిఫ్‌ ఫ్రీ తెలిపారు.

దాదాపు పదేళ్ళ తర్వాత చేపట్టిన ప్రాజెక్టు విజయవంతమైంది. ఈ ప్రాజెక్టు విలువ సుమారు మూడు బిలియన్ డాలర్ ల వరకు ఉంటుందని సమాచారం. ఇదిలా ఉంటే బెజోస్ కంపెనీ బ్లూ ఆరిజన్ 50 అడుగుల పొడవైన బ్లూ మూన్ అనే స్పేస్ క్రాఫ్ట్ ను తయారు చేస్తోంది. ఈ స్పేస్ క్రాఫ్ట్ తయారు చేసిన అనంతరం క్రాఫ్ట్ లో నలుగురు ఆస్ట్రోనాట్స్ ప్రయాణించి మూన్ సర్ఫేస్ లో అడుగు పెట్టబోతున్నారు. 2029లో ఈ ప్రయోగం ప్రారంభం కాబోతోంది. ఇక నాసా కాంట్రాక్ట్ దక్కించుకోవడంపై జెఫ్ బెజోస్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఆస్ట్రోనాట్స్ ను చంద్రుడి పైకి పంపించే ప్రయోగం లో భాగమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉందని బెజోస్ ప్రకటించారు.నాసా ప్రాజెక్ట్‌ దక్కించుకోవడంపై బెజోస్‌ ట్వీట్‌ చేశారు. ఆస్ట్రోనాట్స్‌ను చంద్రుడి మీదకు అడుగు పెట్టే నాసా ప్రయత్నాల‍్లో తాను ఒక భాగమైనందుకు సంతోషంగా ఉందని ట్వీట్‌ చేశారు.