సపోటా పండులో ఎన్నో రకాల పోషకాలు, ఖనిజలవణాలు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. సపోటా తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
సపోటా పండు చాలా తియ్యగా ఉంటుంది. దీనిని చికూ అని కూడా పిలుస్తారు. ఇందులో ఎన్నో రకాలు పోషకాలు ఉంటాయి. సపోటా పండులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఎన్నో రకాల వ్యాధులను దూరం చేస్తుంది. సపోటా తినడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం.
సపోటా పండు ప్రయోజనాలు
- సపోటా అధిక పోషక విలువలను కలిగి ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
- గర్భిణీలు, పాలు ఇచ్చే తల్లులకు సపోటా పండు చాలా మేలు చేస్తుంది.
- ఇది ఎన్నో రకాల క్యాన్సర్లను నిరోధిస్తుంది. ముఖ్యంగా జీర్ణాశయ క్యాన్సర్లను ఇది అడ్డుకుంటుంది.
- సపోటా ప్రూట్ తో స్థూలకాయం లేదా ఊబకాయ సమస్యకు చెక్ పెట్టొచ్చు.
- సపోటా తినడం వల్ల నిద్రలేమి సమస్య దూరమవుతుంది.
- జుట్టు రాలడం, చుండ్రు సమస్యలను కూడా సపోటా పండు దూరం చేస్తుంది.
- సపోటాలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటిచూపుకు చాలా మేలు చేస్తుంది.
- వృద్ధాప్యంలో వచ్చే అంధత్వ నివారణకు సపోటా చాలా సహాయపడుతుంది.
- సపోటా తినడం వల్ల ఎముకల గట్టిపడతాయి.
- ఇందులో ఉండే కాపర్, ఐరన్ వంటి మూలకాలు మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
- నరాల ఒత్తిడిని తగ్గించి ఉపశమనం కలిగించడంలో సపోటా ఉపయోగపడుతుంది.
- సపోటా జలుబు, దగ్గు సమస్యలను కూడా దూరం చేస్తుంది.
- కిడ్నీలో రాళ్లు ఏర్పడే సమస్యకు చెక్ పెట్టడంలో సపోటా సూపర్ గా పనిచేస్తుంది.