Kids

మీ పిల్లలు అల్లరి వారైతే ఇలా చేయండి…..

మీ పిల్లలు అల్లరి వారైతే ఇలా చేయండి…..

ప్రతి తల్లీ, తండ్రీ పిల్లలకు మంచిఅలవాట్లుచెప్పే సమయంలో చక్కని గైడ్‌లా ప్రవర్తించాలి. చిన్న పిల్లలు మనం చెప్పినట్టు వినరు, మనం చేసినట్టు చేస్తారు అని గుర్తు పెట్టుకుని పిల్లల విషయంలో ప్రవర్తించాలి. పిల్లల పెంపకంలో తల్లితండ్రులు ఒక మంచి రోల్‌మోడల్‌గా నిలవాలి. అలాగే మీ పిల్లలు ఏదైనా కొత్త విషయం నేర్చుకొనేటప్పుడు వారికీ ఒక పాజిటివ్‌ వైఖరిని అందివ్వండి. కొత్త కొత్త విషయాలను కనుగొనడం, కొత్త నైపుణ్యా లను ప్రదర్శించడం, కొత్తకొత్త ఆలోచనలు వచ్చేలాంటి ఆటలు ఆడటం లాంటివి వారికీ అలవాటు చేయండి . నేర్చుకోవడం అంటే వారికి ఒక సరదాగా ఉండేలా చేయండి. తల్లిదండ్రుల మధ్య సఖ్యత, ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉండటం వీటన్నిటిని గమనిస్తూ పెరిగే పిల్లలు సహజం గానే ప్రేమపూరిత భావనలను అలవర్చుకుంటారు. అలాగే అన్యోన్యం లేని దంపతులు ఎప్పటికి ఉత్తమ తల్లిదండ్రులు కాలేరు. ఎంత తీరిక లేకపోయినా కూడా పిల్లల కోసం సమయాన్ని వెచ్చించి వారితో కబురులు చెబుతూ వారికి వచ్చే సందేహాలు తీరుస్తూ కథలు చెప్తూ..స్కూలు,స్నేహితుల కు సంబందించిన విషయాలను తెలుసుకుంటూ వారికీ చదువుకోవడం లో సహాయపడుతూ ఉండాలి.

వారితో మీరు ఎక్కువ సమయం గడిపినప్పుడే వారి బలం, బలహీనతలు తెలుసుకునే అవకాశం కలుగుతుంది అంటున్నారు పిల్లల మానసిక వైద్య నిపుణులు.అలాగే పిల్లల అల్లరి కూడా కొంతవరకు తగ్గుతుంది.పిల్లల్ని ఎప్పుడు విమర్శిస్తూ ఉండకండి. పిల్లలకు మీ దగ్గర ఉంటే భద్రం గా ఉంటాం అనే భావనల్ని కల్పించండి. వారి ముందే గొడవలు పడకండి .తల్లిదండ్రుల గొడవలు పిల్లల మీద తీవ్ర ప్రభావం చూపుతాయని గుర్తుపెట్టుకోవాలి. చిన్నతనంలో పిల్లల అల్లరి కి హద్దే ఉండదు.మాట కూడా వినరు.అల్లరి చేయకుండా అస్సలు ఉండలేరు.అలాని వారు చేసిన పనులను చూస్తూ ఊరుకోలేము. ఇలాంటి పిల్లలను మన దారిలోకి తెచ్చుకోవాలంటే వారిని ఎప్పుడు కొత్త విషయాలు తెలుసుకుని నేర్చుకునేలా ప్రోత్సహించండి.

పిల్లలకు ఏమి తోచకపొతే నే బాగా అల్లరి చేసి పేచీలు పెడుతూ ఉంటారు.అలాగే వారికీ చదువు మీద ఆసక్తిని పెంచండి. చదువులో మంచి మార్కులు తెచ్చుకుంటేబహుమతి ఇస్తామని చెప్తామో అలాగే అల్లరిచేయకుండా బుద్ధిగా ఉంటే, బహుమతులు ఇస్తామంటూ వారిని ప్రోత్సహించాలి .. ఇలా చేయడం వల్ల ఎలా మెలగాలో వారు తెలుసుకుంటారు.