Health

5 గంటల కంటే తక్కువ నిద్రతో ఆరోగ్యం దెబ్బతింటుంది…

5 గంటల కంటే తక్కువ నిద్రతో ఆరోగ్యం దెబ్బతింటుంది…

.నిద్రలేమి ఆరోగ్యానికి హానిక‌రం. వ‌య‌సును అనుస‌రించి నిద్ర ఉండాలి. ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా 8 గంట‌ల‌పాటు నిద్ర‌పోవాలి. 8 గంట‌ల కంటే త‌క్కువ‌గా నిద్ర‌పోతే అది అనారోగ్యం. శ‌రీరం నీర‌సించి పోతుంది. క‌ళ్లు దెబ్బ‌తింటాయి. ఏ ప‌ని చేయాల‌న్నా క్ర‌మ‌ప‌ద్ద‌తిలో చేయ‌లేము. అనారోగ్య స‌మ‌స్య‌లు వెంటాడుతుంటాయి. వయ‌సును బ‌ట్టి, చేస్తున్న ప‌నుల‌ను బ‌ట్టి నిద్ర త‌ప్ప‌నిస‌రి. ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ క‌నీసం 5 గంట‌లైనా నిద్ర‌పోవాల‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. 5 గంట‌ల కంటే త‌క్కువ‌గా నిద్ర‌పోతే అది తీవ్ర‌మైన అనారోగ్యానికి దారితీస్తుంది.

ఐదు గంట‌ల కంటే త‌క్కువ‌గా నిద్ర‌పోతే జ్ఞాప‌క‌శ‌క్తి మంద‌గిస్తుంది. ఏం చేసినా, ఏం చ‌దివినా గుర్తుండ‌దు. శ‌రీరం తిరిగి శ‌క్తిని పుంజుకోవాలంటే మంచి నిద్ర అవ‌స‌రం. దీనికోసం క‌నీసం 5 నుంచి 6 గంట‌లు నిద్ర‌పోవాలి. లేదంటే డిప్రెష‌న్ కు గుర‌వుతారు. ఈ డిప్రెష‌న్ క్ర‌మంగా తీవ్ర‌మైన నిర్ణ‌యాలు తీసుకునే దిశ‌గా అడుగులు వేసేలా చేస్తుంది. ఒత్తిడి పెరిగితే ప‌నితీరు త‌గ్గిపోతుంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా క‌నీసం రెస్ట్ అవ‌స‌రం అవుతుంద‌ని, అప్పుడే శ‌రీరంలోని అవ‌య‌వాలు రిఫ్రెష్‌మెంట్ అవుతాయ‌ని ప‌రిశోధ‌కులు స్ప‌ష్టం చేస్తున్నారు. నిద్ర‌లేమి కార‌ణంగా ఊబ‌కాయం, మ‌ధుమేహం వంటికి కూడా ఎటాక్ అయ్యే అవకాశాలు ఉంటాయ‌ని ప‌రిశోధ‌కులు తెలియ‌జేస్తున్నారు.

మారుతున్న కాలానికి త‌గ్గ‌ట్టుగా మ‌నుషులు ప‌రుగులు తీస్తున్నారు. ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం కోసం నిద్ర‌ను త్యాగం చేస్తున్నారు. ఇలా చేయ‌డం ఆరోగ్యానికి తీవ్ర‌మైన చేటు అని వైద్య‌నిపుణులు తెలియ‌జేస్తున్నారు. ఒత్తిడి కార‌ణంగా చాలా మంది ప‌డుకున్నా నిద్ర‌ప‌ట్ట‌దు. అలాంటివారు నిద్ర‌కు ఉప‌క్ర‌మించే గంట‌ముందు గోరువెచ్చ‌టి నీళ్ల‌తో స్నానం చేయాలి. ఇలా స్నానం చేయ‌డం వ‌ల‌న శ‌రీరంలోని మ‌లినాలు తొల‌గిపోతాయి. తద్వారా శ‌రీరం రిలాక్స్ అవుతుంది.