Food

రోజుకు ఎన్ని మామిడిపండ్లు తినాలి….

రోజుకు ఎన్ని మామిడిపండ్లు తినాలి….

వాతావరణానికి అనుగుణంగా మనకు సీజనల్ పండ్లు అందుబాటులో ఉంటాయి. అంటే అవి ఆ సీజన్ లోనే దొరుకుతాయి. వేసవికాలంలో పండ్లలో రారాజు అయిన మామిడి లభిస్తుంది. ఎంతోమంది వీటిని ఇష్టంతో తింటారు. సీజన్ అయిపోయిన తర్వాత ఇవి దొరకవు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల మామిడిపండ్లు అందుబాటులో ఉంటాయి. ఐరన్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి.

శరీరం డీ హైడ్రేషన్ కు గురవకుండా వేసవిలో వచ్చే వ్యాధుల నుంచి మామిడి కాపాడుతుంది. ఎక్కువగా తింటే శరీరానికి హాని కలుగుతుంది. మామిడిపండును ఎక్కువగా తింటే విరేచనాలు, కడుపునొప్పి, అల్సర్లు, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు ఎదురవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పురుగుమందులు వేసి కృత్రిమంగా పండిస్తారు. ఈ కారణంగా కనీసం 2 గంటలు నీటిలో నానబెట్టిన తర్వాత మాత్రమే తినాలి. మామిడిలో ఫ్రక్టోజ్ అనే కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి. కొంత మందికి మామిడిపండ్లు తినడంవల్ల ఎలర్జీ, గొంతు వాయడం జరుగుతుంటుంది. అందరూ వీటిని తిని జీర్ణం చేసుకోలేరు.

ప్రస్తుతం మామిడి పండ్లను పండించడానికి రసాయనాలు విపరీతంగా ఉపయోగిస్తున్నారు. వాటిని పండించడానికి చెట్లకు కూడా క్రిమి సంహారక మందులను వాడుతున్నారు. దీనివల్ల చక్కెర స్థాయిలో పెరుగుదల ఉండటంతోపాటు ట్రైగ్లిజరైడ్ స్థాయిలో అసమతుల్యత ఏర్పడుతుంది. మామిడిపండ్లు ఆరోగ్యానికి మంచివి. కానీ మితంగా తినాలి. రోజు మొత్తంమీద ఒక కాయను తినేబదులు ఆ కాయను రెండు భాగాలుగా చేసి రెండుసార్లు తినడం మంచిది. ఇందులో ఫ్రక్టోజ్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరస్థాయిని పెంచుతుంది.

మామిడి పండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి. ఫైబర్, పొటాషియం, విటమిన్లు వంటి పోషకాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. మామిడిలో ఫైబర్ ఉంటుంది. ఇది కరుగుతుంది. ఎక్కువ సమయం కడుపును నిండుగా ఉంచుతుంది. దీనివల్ల మీరు తక్కువ తింటారు. సులువుగా బరువు తగ్గుతారు.