Movies

సినీ దర్శకుడు కె వాసు మృతి..

సినీ దర్శకుడు కె వాసు మృతి..

సినీ పరిశ్రమలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న మరణాలు అందర్నీ కలిచి వేస్తున్నాయి. అలనాటి సంగీత దర్శకుడు రాజ్ కోటి ద్వయంలో ఒకరైన రాజ్ మరణించడం అందర్నీ షాక్ కి గురి చేసింది. ఆయన మరణ వార్త నుంచి కోలుకోక ముందే సీనియర్ నటుడు శరత్ బాబు (Sarath Babu) మరణం ప్రతిఒకర్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. ఇప్పుడు మరో మరణవార్త టాలీవుడ్ ని పూర్తిగా దుఃఖ సంద్రంలోకి నెట్టేస్తుంది. ప్రముఖ దర్మక నిర్మాత కె వాసు నేడు (మే 26) కన్నుమూశారు.

కిమ్స్‌లో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మృతి.గత కొంతకాలంగా ఆయన కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు.మెగాస్టార్‌ చిరంజీవి తొలి సినిమా ప్రాణం ఖరీదుకు కె వాసు దర్శకుడు.రేపు ఉదయం 6 గంటలకు కిమ్స్ హస్పిటల్ నుంచి ఫిల్మ్ నగర్ ఇంటికి తీసుకొస్తారు.12 గంటలకు మహాప్రస్తానం లో అంత్యక్రియలు..

ఆయన మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. కాగా మన మెగాస్టార్ చిరంజీవిని (Chiranjeevi) ఆడియన్స్ కి పరిచయం చేసింది ఈ దర్శకుడే. చిరంజీవి ‘ప్రాణంఖరీదు’ సినిమాతో వెండితెరకు పరిచయమైన విషయం అందరికి తెలిసిన విషయమే. ఆ సినిమాని డైరెక్ట్ చేసింది కె వాసునే. ఆ తరువాత కూడా చిరుతో కలిసి కోతలరాయుడు, తోడు దొంగలు, అల్లులొస్తున్నారు.. వంటి సినిమాలు కూడా చేశారు.