NRI-NRT

రాహుల్ అమెరికా పర్యటనకు పచ్చజెండా…

రాహుల్ అమెరికా పర్యటనకు పచ్చజెండా…

రాహుల్ గాంధీకి మొత్తానికి ఊరట లభించింది. ఆయన అమెరికాకు వెళ్ళేందుకు కొత్త పాస్ పోర్ట్ జారీ చేసేందుకు కోర్టు అంగీకరించింది. దీనికి సంబంధించిన పత్రాలను ఆయనకు అందజేసింది.

అమెరికా సర్యటనకు రాహుల్ గాంధీకి మార్గం సుగమం అయింది. సాధారణ పాస్ పోర్ట్ కోసం ఎన్వోసీ పత్రాన్ని కోరుతూ ఆయన చేసిన అభ్యర్ధనను కోర్టు అంగీకరించింది. మూడేళ్ళ కాలానికి గానూ ఎన్వోసీ సర్టిఫికేట్ ను ఇచ్చింది. దీంతో రాహుల్ త్వరలోనే కొత్త పాస్ పోర్ట్ పొందే అవకాశం వచ్చింది. మోడీ ఇంటి పేరుతో చేసిన వ్యాఖ్యల వల్ల రాహుల్ గాంధీ ఇబ్బందుల్లో పడ్డారు. రెండేళ్ళ జైలు శిక్షతో పాటూ ఆయన మీద అనర్హత వేటు కూడా పడింది. దీంతో రాహుల్ లోక్ సభ సభ్యత్వం కోల్పోయారు. దీనివల్ల దౌత్యహోదా పాస్ పోర్టను ఆయన అధికారులకు అప్పగించవలసి వచ్చింది.

మరోవైపు నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ నిందితుడిగా ఉన్నారు. 2015 నుంచా ఆయన బెయిల్ మీద ఉన్నారు. దీనివల్ల ఆయనకు సాధారణ పాస్పోర్ట్ ఇచ్చే అవకాశం లేదు. ఇన్నాళ్ళూ దౌత్య హోదా పాస్ పోర్ట్ తో తిరుగుతూ వస్తున్నారు. ఇప్పుడు అది కూడా లేకపోవడంతో సాధారణ పాస్ పోర్ట్ కోసం ఆయన పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ మంజూరు చేసిన సమయంలో రాహుల్ మీద ఎలాంటి ప్రయాణ ఆంక్షలు విధించలేదని కోర్టు తెలిపింది. అయితే పాస్ పోర్ట్ వస్తే నేషనల్ హెరాల్డ్ కేసు మీద ప్రభావితం చేస్తుందని సుబ్రహ్మణ్యస్వామి వాదించారు. కానీ కోర్టు ఆయన వాదనలు తిరస్కరించింది. కానీ రాహుల్ పదేళ్ళకు ఎన్వోసీ కోరితే కోర్టు కేవలం 3 ఏళ్ళకు మాత్రమే జారీ చేసింది.

రాహుల్ గాంధీ ఈ నెల 31 నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. జూన్ 4 మాడిసన్ స్క్వేర్ లోని బహిరంగ సభలో పాల్గొంటారు. అలాగే వాషింగ్టన్, కాలిఫోర్నియాల్లోకూడా పలు కార్యక్రమాల్లో రాహుల్ పాల్గొననున్నారు.